అక్కినేని అఖిల్ ( Akkineni Akhil ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఇప్పటివరకు సరైన హిట్టు ఒక్కటి కూడా పడలేదు.ఈయన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవ్వడంతో నాగార్జున కూడా కాస్త డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక 80 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఏజెంట్ మూవీ ( Agent Movie ) కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యి అఖిల్ సినీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.ఇక అఖిల్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినప్పటికీ అది పూజా హెగ్డే ఖాతాలో పడిపోయింది.అలా ఇప్పటివరకు సరైనా హిట్ లేని అక్కినేని అఖిల్ త్వరలోనే100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారు అంటూ టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే 80 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం 10 కోట్లు కూడా ఏజెంట్ మూవీ రాబట్టలేదు.కానీ ఏ నమ్మకంతో అఖిల్ నెక్స్ట్ సినిమాకి 100 కోట్లు పెడుతున్నారని చాలామంది నెటిజన్లు ఇది అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు అఖిల్ హీరోగా చేయబోయే 100 కోట్ల సినిమాకి అనిల్ కుమార్ ( Anil kumar ) అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారట.కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో 100 కోట్ల మూవీ అంటే చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వంద కోట్ల బడ్జెట్ పెట్టడానికి యూవి క్రియేషన్స్ ( UV Creations ) రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.కథలో కంటెంట్ ఉండడం వల్ల యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిందని చాలామంది భావిస్తున్నప్పటికీ నేటిజన్లు మాత్రం అఖిల్ సినిమాపై మాకు నమ్మకం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ 7 అలాగే తన మూవీ నా సామి రంగలో( Naa Saami Ranga ) బిజీగా ఉన్నారు.ఇక బిగ్ బాస్ ఇంకో నాలుగు వారాలు అయితే ముగుస్తుంది.
ఆ తర్వాత నాగార్జున ( Nagarjuna ) కాస్త రిలాక్స్ అయ్యాక ఈ సినిమా స్టోరీ మరోసారి విని సినిమాకి ఓకే చెబితే అఖిల్ కి సంబంధించిన కొత్త సినిమా జనవరిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ఇక ఇప్పటివరకు ఒక హిట్టు కూడా పడని అఖిల్ ఈ సినిమా విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.