ఈ శునకానికి జాలి బాగా ఎక్కువ.. మెచ్చుకుంటున్న నెటిజన్లు

విశ్వాసానికి మారుపేరుగా కుక్కలను చెబుతుంటారు.అందుకే చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.

 Adorable Video Of Dog Putting Fish Back In Water Viral Video,dog Videos, Fish, V-TeluguStop.com

చాలా సందర్భాలలో దొంగలను అడ్డుకుని ఆ కుక్కలు చాలా ఉపయోగపడుతుంటాయి.కొన్ని కుక్కలైతే తమ యజమానుల కోసం ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం విని ఉంటాం.

ఇక తెలియని వారు ఎవరైనా కనిపిస్తే పెంపుడు కుక్కలు గట్టిగా అరవడమే కాకుండా కాస్త అలవాటైతే మనతో బాగా కలిసి పోతాయి.చాలా మంది తమ పెంపుడు కుక్కలకు నాన్ వెజ్ పెడుతుంటారు.

కొద్దిగా మాంసం ముక్క గాలిలో ఎగుర వేస్తే అవి ఎగిరి వాటిని నోట కరుచుకుంటాయి.అయితే తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కుక్క చూపిన జాలికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఏదైనా ఒక జీవి ప్రాణం తీయడం చాలా సులువు.

అయితే దానిని బ్రతికించడమే చాలా కష్టం.ముఖ్యంగా చాలా మంది వెజిటేరియన్లలో ఉండే భావమే ఇది.ఇక ఓ కుక్క కూడా అచ్చం మనిషిలాగానే జాలి చూపించింది.దానికి చేపలను ఆహారంగా వేయగా వాటిని తినడానికి ఆసక్తి చూపలేదు.

పైగా అవి నీటిలో లేక గిలా గిలా కొట్టుకోవడం చూసి విలవిలలాడిపోయింది.వాటిని నోటిలో వేసుకుని, తిరిగి నీరు ఉన్న ఓ టబ్‌లో విడిచి పెట్టింది.

తనకు ఆకలి ఉన్నా, వాటిని ఏ మాత్రం తినాలనే ఆలోచన దానికి రాలేదు.దీంతో ఆ కుక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గాబ్రియెల్ కోర్నో అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.దీనికి అధిక సంఖ్యలో వ్యూస్, లైకులు దక్కుతున్నాయి.

చాలా మంది నెటిజన్లు తమ కామెంట్ల రూపంలో ఆ కుక్కను ప్రశంసిస్తున్నారు.ఏదైనా ఒక జీవి తన ఆకలి కోసం మరో జీవిని చంపుకు తింటుందని, ఈ కుక్క మాత్రం దయ, జాలి చూపించిందని అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube