మామూలుగా ఒకే నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు విడుదల అవుతున్నప్పుడు ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే ఆ సినిమా ప్రభావం తర్వాత సినిమాపై పడుతుంది ఎటువంటి సందేహం లేదు.ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా ఇలాంటి ప్రభావమే కనిపిస్తోంది.
ఎందుకంటే విడుదలకు ముందే ఆదిపురుష్( Adipurush ) ని ఎక్కువగా అంచనా వేసి 185 కోట్లకు కొనేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మొత్తం రికవరీ అయ్యే సూచనలు చాలావరకు తగ్గిపోతున్నాయి.రోజు రోజుకి రెవిన్యూ డ్రాప్ మరీ ఎక్కువ అవుతోంది.

దాంతో వీకెండ్ మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి.ఎంత వీక్ డే అయినా క్రాస్ రోడ్స్ రెండు థియేటర్లలో ప్రభాస్ కి అయిదో రోజే డెఫిషిట్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు ఈ పరిణామం అంతా కూడా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) నటించిన బ్రో( Bro ) సినిమాపై ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీని నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే.
బిజినెస్ డీల్స్ ఇటీవలే మొదలు పెట్టారు.రేట్లు ఎక్కువ చెప్పడంతో ట్రైలర్ వచ్చే దాకా ఆగాలని బయ్యర్లు నిర్ణయించుకోవడంతో ప్రస్తుతానికి పూర్తి స్థాయి ఒప్పందాలు జరగలేదు.

ఆదిపురుష్ ని పంపిణి చేసింది పీపుల్స్ మీడియానే కాబట్టి వచ్చిన లాస్ కి బదులుగా డిస్ట్రిబ్యూటర్లు బ్రోని కాస్త డిస్కౌంట్ లో ఇమ్మని అడిగే అవకాశాలు లేకపోలేదు.అయితే బ్రో భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి ఒకవేళ తగ్గించినా ఇబ్బంది లేదు.అయితే బ్రో సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన నివేషులను పూర్తి చేస్తున్నారు దర్శకుడు సముద్రఖని.
ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నారు.ఈ సినిమాను జూలై 28 న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
దీంతో ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు చిత్ర బృందం.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు మరొక చిక్కు ఉంది.
టికెట్ రేట్లను పెంచమనే ప్రతిపాదన ఉండకపోవచ్చని కానీ మరో వార్త తిరుగుతోంది.అదేంటంటే ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ నష్టాల గురించి పవన్ నిన్నో సభలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఆ కోణంలో కూడా బ్రోని జాగ్రత్తగా డీల్ చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది.