Yami Gautham : ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్.. కారు ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఏ సెలబ్రిటీ దగ్గరా లేని గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ కొన్న విషయం తెలిసిందే.తన రేంజ్‌కి తగ్గట్టుగా ఈ రేంజ్ రోవర్‌ని ఏకంగా రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట మహేష్.చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తదితరుల దగ్గర రేంజ్ రోవర్ ఉన్నా గోల్డ్ కలర్ SV ( Gold color SV )ఉంది మాత్రం కేవలం మహేష్ దగ్గరే.

 Actress Yami Gautam Buys New Bmw X7 Luxury Suv-TeluguStop.com

ఇది ఇలా ఉంటే గజగా స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్( Yami Gautham ) కూడా ఖరీదైన లగ్జరీ కార్ ని కొనుగోలు చేసింది.యామీ తాజాగా లగ్జీరియస్ బీఎండబ్ల్యూ ఎక్స్7 కొనుగోలు చేసింది.

Telugu Adithya, Bmw Luxury Suv, Buys Bmw, Yami Gautam-Movie

ఈ విషయాన్ని కార్లు విక్రయించే డీలర్‌షిప్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.ఈ సందర్భంగా తమ బ్రాండ్ న్యూ కార్‌తో యామీ తన భర్త ఆదిత్య కలిసున్న ఒక స్టైలిష్ ఫోటోని షేర్ చేసింది.యామీ దగ్గరున్న వాటిలో ఈ బీఎండబ్ల్యూనే( BMW ) ఖరీదైన కారని తెలుస్తోంది.ఈ కారు కాస్ట్ రూ.1.24 కోట్లని సమాచారం.ఇప్పటికే ఆమె గ్యారేజీలో ఆడి ఏ4, ఆడి క్యూ7 కార్స్ ఉన్నాయి.ఇది ఖరీదైన మూడో కార్.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే యామీ గౌతమ్ విషయానికి వస్తే.

Telugu Adithya, Bmw Luxury Suv, Buys Bmw, Yami Gautam-Movie

యామీ తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించింది.2021లో ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌ని( Aditya Dharni ) ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠిల OMG సీక్వెల్ OMG 2తో పాటు ధూమ్ ధామ్ అనే సినిమాలో నటిస్తోంది.కాగా ఈ ధూమ్ ధామ్ సినిమాకి దర్శక నిర్మాత ఆమె భర్త ఆదిత్యనే.

ఈమె సినిమాలతో పాటుగా ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బాగా పాపులారిటీని సంపాదించుకుంది యామి గౌతమ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube