ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన బొంబాయి పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు తేజ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.దర్శకుడు తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నిజం సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించారు.
మా బ్రదర్స్ ఆఫీసర్స్ స్టేజ్ లో ఉన్నారని ఆమె తెలిపారు.నాకు అభ్యంతరకరంగా ఉండే వేషాలు నచ్చవని ఆమె చెప్పుకొచ్చారు.
మన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తే బాధగా ఉంటుందని బొంబాయి పద్మ కామెంట్లు చేశారు.
మనం ఏడవాలంటే కూడా ఆ కన్నీళ్లకు విలువ ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.
నేను ఇస్తానన్న కట్నం ఇవ్వలేకపోయానని అల్లుడువాళ్లు సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించారని బొంబాయి పద్మ తెలిపారు.కెరీర్ పరంగా చాలాసార్లు మోసపోయానని ఆమె కామెంట్లు చేశారు.వినేవాడికి చెప్పేవాడు లోకువ అని ఆమె కామెంట్లు చేశారు.నిజం సినిమా సమయంలో తేజగారు తిట్టారని ఆమె చెప్పుకొచ్చారు.
మైకులో తేజ గారు బూతులు తిట్టారని ఆమె అన్నారు.తేజగారు కోపం వస్తే బూతులు తిడతారని ఏం చేయాలని ఆమె కామెంట్లు చేశారు.
ఆయన తిడితే నాకు ఏడుపు రాలేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఆయనకు కోపం తెప్పించడం వల్లే ఆయన నన్ను తిట్టారని నేను భావించానని ఆమె కామెంట్లు చేశారు.ఆయన మనసులో ఏదో పెట్టుకుని ఎప్పుడూ తిట్టరని ఆమె చెప్పుకొచ్చారు.
నేను మంచి ఆర్టిస్ట్ అని తేజ గారు ఒప్పుకుంటారని ఆమె తెలిపారు.
తేజ గారు ఏ మూడ్ లో ఉన్నారో తిట్టేశారని ఆమె అన్నారు.నిజం సినిమాలో మహేష్ బాబు అత్త అని పిలిచేవారని ఆమె కామెంట్లు చేశారు.
తిట్లు బాగా పడ్డాయంట కదా అని మహేష్ బాబు అన్నారని ఆమె వెల్లడించారు.బొంబాయి పద్మ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.