ఐరన్ రిచ్ గా ఉండే ఈ ఐదు రకాల పండ్లు తింటే రక్తహీనత మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

ఇటీవల కాలంలో చాలా మంది రక్తహీనత సమస్య( Anemia problem )తో బాధపడుతున్నారు.శరీరంలో ఐరన్ కొరత కారణంగా హిమోగ్లోబిన్ శాతం డౌన్ అవుతుంది.

 Best Iron Rich Fruits To Get Rid Of Anemia , Iron Rich Fruits, Anemia, Lat-TeluguStop.com

ఫలితంగా రక్తహీనత బారిన పడతారు.దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో జబ్బులు చుట్టుముడతాయి.

అందుకే రక్తహీనతను నివారించుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా ఐరన్ రిచ్ గా ఉండే ఐదు రకాల పండ్లు ఉన్నాయి.వీటిని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐరన్ రిచ్ పండ్లు ఏవేవో తెలుసుకుందాం పదండి.

Telugu Anemia, Dates, Figs, Tips, Hemoglobin, Iron, Latest, Pomegranate, Strawbe

అత్తిపండ్లు లేదా అంజీర్.( Figs ) ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాదారణ పొందిన పండ్ల‌లో ఒకటి.అత్తిపండ్లు పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.

ముఖ్యంగా అత్తిపండ్లలో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.రోజుకు ఒక అత్తి పండును తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

అలాగే ఐరన్ పుష్కలంగా ఉండే పండ్లలో దానిమ్మ ముందు వరుసలో ఉంటుంది.నిత్యం దానిమ్మ పండును తింటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ అందుతుంది.హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత దూరం అవుతుంది.ఖర్జూరం పండులో కూడా ఐరన్ కంటెంట్ రిచ్ గా ఉంటుంది.

రక్తహీనతకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఖర్జూరం పండును డైట్ లో చేర్చుకోండి
.

Telugu Anemia, Dates, Figs, Tips, Hemoglobin, Iron, Latest, Pomegranate, Strawbe

అలాగే స్ట్రాబెర్రీ పండ్లు ( Strawberry )ఐరన్ తో సహా వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.తరచూ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం అవ్వడమే కాదు మరెన్నో లాభాలు మీ సొంతమవుతాయి.ఇమ్యూనిటీ బూస్టర్ గా సైతం స్ట్రాబెరీ పండ్లు ప‌ని చేస్తాయి.

ఇక పుచ్చకాయలో నీరు తప్ప ఏమీ ఉండదని భావిస్తుంటారు.కానీ పుచ్చకాయలో నీరుతో పాటు వివిధ పోషకాలు ఉంటాయి.

అందులో ఐరన్ కూడా ఒకటి.వారానికి రెండు మూడు సార్లు పుచ్చకాయ ని తీసుకుంటే ఐరన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.

రక్తహీనత మీ దరిదాపుల్లోకి చేరకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube