2002 సంవత్సరం నుంచి సినిమా రంగంలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్లలో భావన కూడా ఒకరు.కేరళకు చెందిన భావన అసలు పేరు కార్తికా మీనన్.70కు పైగా సినిమాలలో నటించిన భావన తన నటనతో ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు.ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచే భావన సినిమాల్లోకి రాగా ఆమె తండ్రి సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం గమనార్హం.
బాల్యం నుంచి ఈ నటికి హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది.
ప్రముఖ సినీ నటీమణులలో ఒకరైన అమల భావన ఫేవరెట్ హీరోయిన్ కావడం గమనార్హం.16 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను ప్రారంభించిన భావన కెరీర్ లో హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాప్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.తెలుగులో భావన ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలలో నటించగా ఈ సినిమాలలో భావన నటనకు మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా ఈ మూడు సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగులో భావనకు ఆఫర్లు తగ్గగా ఆమె ఇతర భాషల్లో ఆఫర్లతో బిజీ అయ్యారు.
ఐదు సంవత్సరాల క్రితం ఈ నటి కిడ్నాప్ అయ్యారు.మలయాళంలో గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ ఈ కేసులో నిందితుడని విచారణలో తేలింది.అయితే ఈ కేసు గురించి అందరూ మరిచిపోయారు.
ఈ కేసు గురించి తాజాగా భావన ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఐదు సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న దాడి తన పేరు, గుర్తింపుపై ప్రభావం చూపిందని భావన చెపుకొచ్చారు.ఈ ప్రయాణం సులువైన ప్రయాణం కాదని తాను తప్పు చేయకపోయినా తనను అవమానించే, ఒంటరి చేసే ప్రయత్నాలు మాత్రం జరిగాయని భావన అన్నారు.అయితే చాలామంది తనకు మద్దతు ఇచ్చారని ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు శిక్ష పడాలని ఇతరులకు ఇలాంటి కష్టాలు ఎదురు కాకుండా పోరాటం కొనసాగిస్తానని భావన వెల్లడించారు.