యాప్స్ ( Apps ) అంటే ఏమిటో తెలియని ప్రజానీకం ఇక్కడ లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఇక్కడ ప్రతిఒక్కరు తమ అవసరాలు అనగా వినోదం కోసం కావచ్చు, ఆర్ధిక లావాదేవీల కోసం కావచ్చు, సమాచారం కోసం కావచ్చు.
ఇలా కారణం ఏదైనా వివిధ రకాల యాప్స్ పైన ఆధారపడక తప్పని పరిస్థితి వుంది.అందుకే వివిధ రకాల యాప్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో ఎరుక ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.ఎందుకంటే రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు.
ఆ సంగతి అలా ఉంచితే మనం రోజూ వివిధ అవసరాల కోసం కొంత డబ్బుని( Money ) ఖర్చు చేస్తుంటాం.ఒక్కోసారి దేనికి ఎంత ఖర్చు చేశామోనన్న అవగాహన లేకుండా ఖర్చు చేసేస్తూ ఉంటాం.వెనక్కి తిరిగి ఆలోచిస్తే అసలు దేనికి ఖర్చు చేసామో కూడా గుర్తు ఉండదు.ఇక అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేయడంతో నెల తిరగకుండానే జేబు ఖాళీ అవుతుంది.
ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.కానీ ఎలా? స్వతహాగా కుదరనప్పుడు మీరు యాప్స్ పైన ఆధారపడొచ్చు.అవును, మీరు ఎక్కువ ఖర్చు చేసినట్టయితే అవి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాయి.
ఈ లిస్టులో చెప్పుకోదగ్గ మొదటి యాప్ మింట్(Mint) ఇందులో నెలవారీగా ఖర్చుల చిట్టాను నోట్ చేసుకుంటే దేనికెంత వెచ్చిస్తున్నామనే విషయం మీకు చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.మీ ఆర్థికపరమైన లక్ష్యాలకు సహకరించే యాప్ ఇది.అదేవిధంగా మనీ మేనేజ్‌మెంట్ విషయంలో మీకు ఈ యాప్ చేదోడు వాదోడుగా నిలుస్తుంది.తరువాతది వాల్లెట్ (Wallet) ఇది కూడా మీకు ఆర్ధిక పరంగా చాలాబాగా ఉపయోగపడుతుంది.ఖర్చులను మానిటర్ చేసి బడ్జెట్ ప్లాన్ చేసుకునేలా వాల్లెట్ యాప్ సహకరిస్తుంది.ఇక 3వది ఎక్స్‌పెన్సిఫై(Expensify) ఎవరైతే బిజినెస్, ట్రావెల్ ఖర్చులపై ఫోకస్ పెట్టాలని అనుకుంటారో వారికి ఎక్స్‌పెన్సిఫై యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.