ఈ ఇంజనీర్ కి జేజేలు కొట్టాల్సిందే.. పూర్వీకుల ఆహార పద్ధతి వినియోగంలోకి!

నేటి మానవుడి దైనందిత జీవన అలవాట్లు అనేవి చాలా మారిపోయాయి.ఒకప్పటితో పోల్చుకుంటే ఇపుడు మనిషి అనేక రకాల రుగ్మతలతో బతుకునీడుస్తున్నాడు.

 A Young Man Ancestral Food Method Into Use Viral, Olden, Days, Food , Engineer-TeluguStop.com

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు కలకం రేపుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే.కరోనా వ్యాప్తి తరువాత ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఆఖరికి చిన్న వయసు యువకులు సైతం ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అయితే మరీ దారుణం.

Telugu Days, Engineer, Ganuga Oil, Latest, Olden-Latest News - Telugu

ఇపుడు ఈ మరణాలకు కారణం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఏది ఏమైనా తినే ఆహారం నేడు కలుషితం అయిపోయిందని మాత్రం మనిషి రియలైజ్ అయ్యాడు.అవును, మన జీవన శైలే దానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు.మన పూర్వీకులు అంతకాలం జీవించారు అంటే దానికి కారణం వారి జీవన విధానమే.ఆరోగ్య నిపుణులు సైతం మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే.

మన ఆరోగ్యం( Health ) మన చేతిలోనే అంటూ.ఓ యువకుడు పూర్వీకుల నాటి ఆహారం వైపు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.

Telugu Days, Engineer, Ganuga Oil, Latest, Olden-Latest News - Telugu

ఇటీవలి కాలంలో వరుస గుండెపోటు మరణాలకు కారణం.మనం వంటకాల్లో వినియోగించే నూనె కారణం అని చెబుతున్నాడు ఆ యువ ఇంజనీర్.అందుకే.మన పూర్వీకులు వాడిన గానుగ నూనెను మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే యత్నం చేస్తున్నాడు మన ఇంజనీర్.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్( Srinivas ) జనులకు మేలు చేయాలని సదుద్దేశంతో గానుగ నూనె( Ganuga oil ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.తనకు ఉన్న ఏకరం భూమిలో రూ.10 లక్షలు వ్యయంతో రేకు షెడ్డు నిర్మించి అందులో మన పూర్వీకులు అవలంబించిన రెండు ఎద్దుగానుగ (మిషన్లు) కర్రలతో రోలు తయారీ విధానం ద్వారా ఆర్గానిక్ ముడి సరుకులు ఉపయోగించి స్వచ్ఛమైన నువ్వుల నూనె, వేరుశనగ, కొబ్బరి నూనెలను తయారుచేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube