Rajasthan Lady Teacher :స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవడానికి లింగాన్ని మార్చుకున్న లేడీ టీచర్!

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే పిల్లల బతుకులను గుగ్గిపాలు చేస్తున్నారు.రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ మహిళా టీచర్ చేసిన ఒక పని తెలిసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

 A Lady Teacher Who Changed Her Gender To Marry A Student ,rajasthan, Bharatpur,-TeluguStop.com

ఈ లేడీ టీచర్ తన లింగాన్ని మార్చుకుని తన విద్యార్థినిని పెళ్లి చేసుకుంది.వివరాల్లోకి వెళితే, మీరా అనే మహిళ నాగ్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

ఆమె పనిచేస్తున్న స్కూల్లోనే కల్పన అనే విద్యార్థిని చదువుతోంది.కాగా వీరిద్దరూ ఇదే పాఠశాలలో పరిచయం పెంచుకున్నారు.ప్రేమలో కూడా పడ్డారు.వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఒకే లింగం కారణంగా సమస్యలు వచ్చాయి.

చివరగా 2019లో మీరా తన లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది.అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని చివరకు ఆమె తన లింగాన్ని మార్చుకుంది.

నవంబర్ 4, 2022న ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

Telugu Bharatpur, Gender Change, Rajasthan, Teacher, Married-Latest News - Telug

మీరా ఇప్పుడు ఆరవ్ అని పేరు పెట్టుకుంది.వీరి పెళ్లితో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉండటం విశేషం.నలుగురు అక్కాచెల్లెళ్లలో మీరా చిన్నది.

మీరా భార్య కల్పన చాలా మంచి క్రీడాకారిణి.కల్పన 11వ-12వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఆడింది.2021లో గ్రాడ్యుయేషన్ సమయంలో జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది.జనవరిలో జరిగే అంతర్జాతీయ ప్రో-కబడ్డీలో పాల్గొనేందుకు కల్పన ఇప్పుడు దుబాయ్ వెళ్లనుంది.

కొందరు ఈ పెళ్లిని స్వాగతిస్తే, మరి కొందరు మాత్రం ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు.విద్యార్థినిని మాటలతో నమ్మించి ఆమెను టీచర్ పెళ్లి చేసుకుని ఉంటుందని కొందరు అంటున్నారు.

ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube