వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది.సుమారు 16 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
నాగ్ పూర్, ఢిల్లీతో పాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామన్నారు.ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు.
దేశ భద్రతకు భంగం కలిగేలా డేటాను అపహరిస్తున్నారన్న సీపీ బీమా, లోన్లుకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటాను చోరీ చేశారని వెల్లడించారు.