మనుషుల్లో, ఆక్టోపస్‌ల్లో ఒక కామన్ పోలిక.. అదేంటో తెలిస్తే?

మనిషికి, కోతికి చాలా దగ్గర పోలికలు ఉంటాయంటారు.అయితే కేవలం కోతి మాత్రమే కాదు.

 A Common Similarity Between Humans And Octopuses  If You Know That , Common Simi-TeluguStop.com

మరెన్నో ఇతర జంతువులకు కూడా మనుషులతో దగ్గర పోలికలు ఉంటాయని చాలామంది శాస్త్రవేత్తలు( Scientists ) చెబుతున్నమాట.ఇప్పటికే ఈ విషయంలో వారికి ఎన్నో ఉదాహరణలు లభించాయి.

అవును, తాజాగా ఆ లిస్టులోకి ఆక్టోపస్‌లు ( Octopuses )చేరిపోయాయి.ఆక్టోపస్‌లకు ఎనిమిది తొండాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసినదే.

తాజాగా అవి పడుకునే విధానాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరీక్షించారు.ముఖ్యంగా పడుకున్నప్పుడు ఆక్టోపస్ బ్రెయిన్ యాక్టివిటీని వారు స్టడీ చేయడం జరిగింది.

Telugu Aquatic Animals, Humans, Latest, Octopuses-Latest News - Telugu

ఈ క్రమంలో వారు అనేక విషయాలు కనిపెట్టారు.అవి పడుకున్నప్పుడు వాటి స్కిన్ ప్యాటర్నింగ్( Skin patterning ) ఎలా ఉందో.మేలుకొని ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నట్టు గుర్తించారు.కొన్ని జంతువుల్లో ఇలా జరిగినప్పటికీ ఆక్టోపస్ నిద్రకు, మనిషి నిద్రకు పోలికలు ఉన్నట్టు తెలుసుకున్నారు.మనిషి పడుకున్నప్పుడు కూడా మెదడులో ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది.ఆక్టోపస్‌లలో కూడా అచ్చం అలాగే జరుగుతోందని అంటున్నారు.

ఒక్కసారి ఆక్టోపస్‌లు యాక్టివ్ స్లీప్‌లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే.కొంతకాలం తర్వాత అవి ఎక్కువగా నిద్రపోతుంటాయని వారు గమనించారు.

మనుషులు కూడా అచ్చం అంతే.

Telugu Aquatic Animals, Humans, Latest, Octopuses-Latest News - Telugu

వాటి యాక్టివ్ స్లీప్‌ను డిస్టర్బ్ ( Disturb active sleep )చేయడం ద్వారా కొన్నిరోజులకు వాటికి నిద్ర సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని కనుగొన్నారు.ఇదే విధంగా మనుషులకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.మనుషులు ఎలా అయితే నిద్రలో నుండి లేచిన తర్వాత వారికి వచ్చిన కలను గుర్తుపెట్టుకుంటారో.

ఆక్టోపస్‌లు కూడా అలాగే వాటి కలను గుర్తుపెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ఇలా ఆక్టోపస్ నిద్రలో, మనిషి నిద్రలో పలు పోలికలను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.

ముందు ముందు మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని ఆశిస్తున్నారు.దీని ద్వారా మనుషుల నిద్ర సంబంధిత వ్యాధులకు పరిష్కారాలు దొరికే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube