పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఇటీవలే విడుదల అయిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా డిజాస్ట్రర్‌గా నిలిచింది.
ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.ప్రతి ఏరియాలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి ధర పలికింది.
అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో నష్టం వచ్చింది.ఈ నష్టాన్ని పవన్ మరియు నిర్మాత భరించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు.
తమిళంలో కొన్ని సందర్బాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న విషయం తెల్సిందే.తెలుగులో మాత్రం అంత మంచి మనస్సు ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా కనబర్చింది లేదు.
తెలుగులో మొదటగా పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తాడా అనేది చూడాలి.పవన్ ఈ సినిమాకు మొత్తంగా 28 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఆ మొత్తం నుండి సగం అయినా పవన్ వదులుకుంటాడా అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం.పవన్ వారికి ఆర్థిక సాయం చేయకున్నా తాను తర్వాత నటించబోతున్న సినిమా పంపిణీ హక్కులను తక్కువ మొత్తంకు ఇప్పిస్తే సరిపోతుందని కొందరు అంటున్నారు.
మరి పవన్ అలా అయినా చేసి తన మంచి మనస్సును చాటుకుంటాడా అనేది చూడాలి.