అది త్రిషకు చివరి సినిమానా?

తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న ముద్దుగుమ్మ త్రిష.ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసింది.

 Is Nayaki Last Movie For Trisha..?-TeluguStop.com

దాదాపు పది హేను సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్న త్రిష ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఆమె సన్నిహితులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘నాయకీ’ చిత్రం ఆమెకు చివరి సినిమా అయ్యి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

త్రిష గత కొంత కాలంగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏ సినిమాలు ఒప్పుకున్నది లేదు.‘నాయకీ’ సినిమా కోసం ఈమె ఆరు నెలలుగా వర్క్‌ చేస్తూ ఉంది.

ఆ సినిమాను ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.ఆ సినిమా విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఈమె సినిమాలకు గుడ్‌ బై చెప్పే విషయమై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక తెలుగు నిర్మాత ఈమెతో సినిమాను చేసేందుకు సంప్రదించిన సమయంలో ఈమె ప్రస్తుతానికి సినిమాలు కొత్తవి ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పేసిందట
అంతకు ముందు కూడా తమిళంలో ఈమెకు అవకాశాలు వచ్చాయని, కాని ఈమె మాత్రం నో చెబుతూ వస్తుందని అంటున్నారు.హీరోయిన్‌గా నటించిన చోట ఇప్పుడు సహాయ పాత్రల్లో నటించడం తన వల్ల కాదు అనే ఉద్దేశ్యంతో త్రిష ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని అంటున్నారు.

రిటైర్‌మెంట్‌ విషయమై త్రిష ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.త్రిష ‘నాయకీ’ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube