పీఆర్‌ఓపై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాను ఏ పీఆర్‌ఓను నియమించుకోలేదు అని, ఆ అవసరం నాకు లేదు అంటూ ప్రకటించాడు.తాను పీఆర్‌ఓను నియమించుకుంటున్నట్లుగా అంతా భావిస్తున్నారు.

 Mega Hero Gives Clarification On Personal Pr-TeluguStop.com

తనకు ఇప్పటి వరకు వ్యక్తిగత పీఆర్‌ లేడు.ఇకపై ఉండడు అని అనుకుంటున్నారు.

నాకంటూ వ్యక్తిగత పీఆర్‌ అవసరం లేదు అని వరుణ్‌ తేజ్‌ ప్రకటించాడు.ఇప్పుడు ఉన్నట్లుండి వరుణ్‌ ఇలాంటి ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ సినీ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.


వరుణ్‌ ప్రకటన వెనుక ఒక కారణం ఉంది.మెగా ఫ్యామిలీకి వ్యతిరేకి అయిన ఒక జర్నలిస్ట్‌ను వరుణ్‌ తేజ్‌ తన పర్సనల్‌ పీఆర్‌గా పెట్టుకున్నాడు అంటూ వార్తలువచ్చాయి.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆ వ్యక్తిని ఇప్పుడు వరుణ్‌ పీఆర్‌గా పెట్టుకోవడం మెగా సన్నిహితులకు రుచించలేదు.అందుకే ఈ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

త్వరలో వరుణ్‌ తేజ్‌ తన తర్వాత సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రారంభించబోతున్నాడు.ఆ సినిమాను ఇదే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘కంచె’ చిత్రం తర్వాత వరుణ్‌ ఇంకా కొత్త సినిమాను ప్రారంభించింది లేదు అనే విషయం తెల్సిందే.


Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube