రోజుకు ఎన్ని మామిడిపండ్లు తిన‌డం ఆరోగ్య‌దాయ‌కమో తెలిస్తే...

మామిడి( Mango ) సీజన్ న‌డుస్తోంది.ప్రతి సంవత్సరం చాలా మంది వేసవి కోసం వేచి ఉంటారు, ఎందుకంటే ఈ సీజన్‌లో వారు జ్యుసీ, గుజ్జు మామిడిని తినవచ్చ‌ని క‌ల‌లుగంటారు.

 How Many Mangoes To Eat In A Day , Mangoes Health , Health Tips, Throat Pain , S-TeluguStop.com

మామిడిని స్మూతీ రూపంలోనో, స్వీట్ రూపంలోనో, షేక్ రూపంలోనో అనేక రకాలుగా తీసుకుంటారు.దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే ప్రతి మామిడి రకానికీ దాని ప్రత్యేక రుచి ఉంటుంది.

అవి రుచికరమైనవి మాత్రమే కాకుండా అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి మరియు శరీరాన్ని హైడ్రేట్( Hydrate ) చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.వేడి వాతావ‌ర‌ణంలో వ్యాధుల నుండి రక్షిస్తాయి.

అయితే ఈ అద్భుతమైన పండ్లను మనం ఎంతగానే ఇష్టపడుతుంటాం.అయితే మామిడిని అతిగా తింటే అది మన శరీరానికి హాని కలిగిస్తుంది.

ఇది కడుపు ఇన్ఫెక్షన్‌( Stomach infection )కు కూడా దారి తీస్తుంది.మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, అజీర్తి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నీటిలో నానబెట్టిన తర్వాత‌నే తినాలి”మామిడిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.అయితే పురుగుమందుల వాడకం, కృత్రిమంగా పక్వానికి తీసుకురావ‌డం అనారోగ్యం క‌లిగిస్తుంద‌ని బెంగళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్ క్లినికల్ న్యూట్రిషన్ డైటెటిక్స్ హెడ్ డాక్టర్ ఎడ్వినా రాజ్ తెలిపారు.అందుకే వాటిని 2 గంటల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి.

మామిడి పండ్లలో చాలా పోషకాలు మరియు అవసరమైన విటమిన్లు ఉంటాయి, అవి ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్‌ను కూడా కలిగి ఉంటాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

Telugu Carbohydrate, Tips, Hydrate, Mangoes, Stomach, Throat Pain-Telugu Health

అంద‌రికీ జీర్థొ కాదు డాక్టర్ ఎడ్వీనా రాజ్ మాట్లాడుతూ.మామిడి పండ్లను సరైన పద్ధతిలో తిన‌క‌పోవ‌డ‌మే పెద్ద సమస్య.దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

చాలా మందికి మామిడిపండ్లు అంటే ఎలర్జీ.కొంద‌రికి గొంతు( Throat Pain ) ఉబ్బిపోతుంది.

అందరూ సరిగ్గా జీర్ణం చేసుకోలేరు.అలాగే మామిడి పండ్లను కృత్రిమంగా పండించడం మరియు పురుగుమందుల వాడకం మొద‌లైన‌వి అనారోగ్యం క‌లిగిస్తాయి.

ఇటువంటి పండ్లు కార‌నంగా రక్తంలో చక్కెర స్థాయిలు మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది.ఈ కార‌ణంగానే మామిడిపండ్లు ఆరోగ్యకరమైనవి అయినా, వాటిని మితంగా తీసుకోవాలి.

Telugu Carbohydrate, Tips, Hydrate, Mangoes, Stomach, Throat Pain-Telugu Health

ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు?మొత్తం మామిడిపండును ఒకేసారి తినే బదులు దానిని రెండు భాగాలుగా చేసి ఆ తర్వాత రోజుకు రెండుసార్లు తింటే మంచిది.దీనిలో ఫ్రక్టోజ్‌లో సమృద్ధిగా ఉన్నందున, ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.ఆహార పరంగా చూస్తే మీరు మామిడి పండ్లను ఎక్కువగా తిన్నప్పుడు ఇబ్వందుల‌కు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.

పుష్కలంగా నీరు తాగాలి.విరేచనాలు మరియు కడుపు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ORS మరియు అధిక ఫైబర్ ఆహారాలు, పండ్లు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube