నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్ ఎప్పుడు చెబుతారు?

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో షూటింగ్ ఈ రోజుతో పూర్తి అయిపోయింది.ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు.

 Little Confusion In Nannaku Prematho Release Date-TeluguStop.com

డబ్బింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి.రేపటి రాత్రివరకు సినిమాకు సంబంధించి రఫ్ కాపి వచ్చేస్తుందని సమాచారం.

ఇక 8వ తేదిన సెన్సార్ కి సినిమా వెళ్తుందని చెబుతున్నా, ఇంకా సెన్సార్ బోర్డుకి ఈ విషయంపై యూనిట్ వర్గాల నుంచి ఎలాంటి సమచారం అందలేదంట.ఇది కాస్త కలవర పెట్టే విషయమే అయినా, మరీ అంత పెద్ద సమస్య కూడా కాదు.

ఇక అసలు విషయం ఏమిటంటే, సినిమా కొత్త పోస్టర్స్ లో కాని, ప్రకటనలలో కాని, పీ ఆర్ టీమ్ కాని, విడుదల తేదిని పక్కగా చెప్పకపోవడం.సంక్రాంతి రిలీజ్ అనేది ఖరారు అయినా, ఖచ్చితమైన తేదిని ఇంకా చెప్పలేదు.

ఎందుకంటే, రఫ్ కాపి సిద్ధం కాకముందే తేది చెప్పేస్తే, ఎలాంటి ఆలస్యమైన ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే, వచ్చే రెండు రోజుల్లో విడుదల తేదితో పోస్టర్లు విడుదల చేసే యోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 13వ తేది లెక్కన నాన్నకు ప్రేమతో థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి.

అదేరోజు రావడం ఖాయం అయినా, రిస్క్ తీసుకోకుండా సంక్రాంతి రిలిజ్ అంటూ సరిపెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube