ఎన్టీఆర్‌ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు.సక్సెస్‌ వచ్చిన సినిమా దారిలో నడిచేందుకు ఎక్కువగా ఇష్ట పడుతారు.

 Will Ntr Break That Flop Sentiment..?-TeluguStop.com

ఫ్లాప్‌ అయిన సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని తర్వాత సినిమాల్లో రిపీట్‌ చేసేందుకు ఆసక్తి చూపరు.కాని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికి మూడు సార్లు ఫ్లాప్‌ అయినా కూడా టైటిల్‌ సెంటిమెంట్‌ను పట్టించుకోకుండా నాల్గవ సారి కూడా టైటిల్‌ను ఫిక్స్‌ చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌ కెరీర్‌లో ‘నాగ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’ చిత్రాలు ఏ స్థాయి ఫ్లాప్‌ చిత్రాలుగా మిగిలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ మూడు సినిమాలు కూడా ‘న’ అక్షరంతో ప్రారంభం అయ్యాయి.

దాంతో ఎన్టీఆర్‌ మళ్లీ ‘న’ అక్షరంతో సినిమా టైటిల్‌ను పెట్టే సాహసం చేయడు అని అంతా భావించారు.అయితే సుకుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాడు.

దర్శకుడు సుకుమార్‌ కథానుసారంగా ఈ టైటిల్‌ను ఎంపిక చేయడంతో ఎన్టీఆర్‌ నో చెప్పలేక పోయినట్లుగా తెలుస్తోంది.‘న’ అక్షరం బ్యాడ్‌ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్‌ ఈసారైనా బ్రేక్‌ చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube