మహీంద్రా టెక్ అధినేత ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి అందరికీ తెలిసిందే.ఈ రోల్ మోడల్ ప్రతి రోజూ తనకి నచ్చిన అంశాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ, తన అనుచరులను ఉత్సాహ పరుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అది కాస్త హాట్ టాపిక్ అవుతోంది.ఇక నేటి దైనందిత జీవితంలో వ్యాయామం కోసం కేటాయించేందుకు ఎవరికీ సమయం దొరకడం లేదు అనేది నిర్వివాదాంశం.
అవును, ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకడంలేదు.ఫిట్‌గా మారాలనే కోరిక ఉన్నప్పటికీ వారి కోరిక తీరడంలేదు.
అలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు.ఇక ఆ ప్రయోగం పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మనసుని దోచుకోవడం విశేషం.
వివరాల్లోకి వెళితే, ఢిల్లీ ఐఐటీకి ( IIT Delhi )చెందిన అనురన్ డాని, అమన్ రాయ్, అమల్ జార్జ్, రోహిత్ పటేల్ ( Anuran Dani, Aman Roy, Amal George, Rohit Patel )అనే నలుగురు గ్రాడ్యుయేట్లు ఒక హోమ్ జిమ్ ఏర్పాటు చేసారు.దీనికి వారు `ఏరోలీప్ ఎక్స్` అని పేరు పెట్టారు.ముఖ్యంగా చిన్న చిన్న ఫ్లాట్లు, ఇల్లు, హోటల్స్‌లో ఈ పరికరాన్ని ఉపయోగించి వర్కవుట్స్ చేసుకోవచ్చన్నమాట.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ మెషిన్‌ను ఉపయోగించి 150కు పైగా వ్యాయామాలను చేసుకోవచ్చని అంటున్నారు.
ఎందుకంటే, నిపుణులైన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ సూచనలకు సంబంధించి వంద గంటలకు పైగా కంటెంట్ ఈ మెషిన్లో ఉంటుంది మతి!.
ఇందులో శరీరంలోని ప్రతి కండరాన్ని కదిలించేలా వర్కవుట్లు ఉంటాయి.ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ `జిరోదా` ( Ziroda )వ్యవస్థాపకుడు నితిన్ కామత్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.ఈ మెషిన్లో ఏఐ ఆధారిత ట్రైనింగ్ సెషన్లు ఉంటాయి.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ… `ఈ హోమ్ జిమ్ పరికరాన్ని ఢిల్లీకి చెందిన నలుగురు గ్రాడ్యుయేట్లు రూపొందించారు.ఇదేమంత రాకెట్ సైన్స్ కాదు.దీనిని చిన్న హోటళ్లు, అపార్ట్మెంట్లు, చిన్న ఇళ్లలోనూ ఉపయోగించుకునేలా డిజైన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది.మెకానిక్స్, ఫిజికల్ థెరపీని అనుసంధానిస్తూ ఈ పరికరాన్ని తయారు చేయడం గొప్ప విషయం!` అని వారిని కీర్తిస్తూ ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.