వయసు 24 వెళ్లే.. అయినా ఈ యువతికి 16 ఏళ్ల కూతురు ఉంది..?

సాధారణంగా ఆడవాళ్లు 21 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారు.కొన్నిచోట్ల లీగల్ మ్యారేజ్ ఏజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది.

 Although She Is 24, This Young Woman Has A 16-year-old Daughter, Tasia Tayor, 24-TeluguStop.com

ఎలా చూసుకున్నా కనీసం పదహారేళ్లు వచ్చాకే మహిళలు పెళ్లి చేసుకుంటారు దాని తర్వాత పిల్లలకు అంటారు ఆ లెక్కన చూసుకుంటే వాళ్లకు 30 ఏళ్లు వచ్చేవరకు పదహారేళ్ల పిల్లలు ఉండరని చెప్పుకోవచ్చు.కానీ టేసియా టేలర్ ( Tecia Taylor )అనే 24 ఏళ్ల మహిళ మాత్రం పదహారేళ్ల బిడ్డను కలిగి ఉంది.

ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది.ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు.

అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె పెద్ద కూతురుకి ఆమెకన్నా కేవలం 8 ఏళ్లు తక్కువ వయసు మాత్రమే.

ఈ విషయం తెలిసి చాలా మంది ఆమె ఎంత చిన్న వయసులోనే తల్లి ఎలా అయింది? అని అనుమానిస్తున్నారు.ఈ వయసు తేడా చాలా మందిలో చర్చకు దారితీసింది.ఆమె రెండవ కూతురు రోరికి 14 ఏళ్లు, కుమారుడు ఇసయియాకు 12 ఏళ్లు, చిన్న కూతురు ఆష్టిన్‌కి ( Austin )కేవలం 5 నెలలు.

ఈ పిల్లల వెనుక రహస్యం ఏంటంటే, టేసియా, 26 ఏళ్ల ఆమె భర్త వివాహం చేసుకున్న తర్వాత, అనాథ శరణాలయం నుంచి పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మొదట వారు 1-6 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలను దత్తత తీసుకోవాలని ఆలోచించారు.

Telugu Mother, Foreign, Nri, Tasia Tayor, Young-Latest News - Telugu

కానీ, అనాథ శరణాలయం వారు 14 ఏళ్ల రోరి అనే అమ్మాయిని దత్తత తీసుకోవాలని ప్రతిపాదించగా, వారు ఆ అవకాశాన్ని వదులుకోలేకపోయారు.కొన్ని రోజుల తర్వాత, రోరికి 12 ఏళ్ల తమ్ముడు ఇసయియా ఒంటరిగా ఉండలేడని, అతనికి కూడా ఒక ఇల్లు కావాలని తెలిసింది.అందుకే, ఆ దంపతులు ఇసయియాను కూడా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.తమిరే, టేసియా అమ్మమ్మ చేత పెంచబడింది.అమ్మమ్మ చనిపోయిన తర్వాత, 16 ఏళ్ల తమిరేని టేసియా తన బాధ్యతగా తీసుకుని, తన కూతురుగా చేసుకుంది.అంటే, టేసియా తమిరేకి అమ్మలాంటి వాళ్ళు.

Telugu Mother, Foreign, Nri, Tasia Tayor, Young-Latest News - Telugu

ఇంతకు ముందు, టేసియాకు ఆష్టిన్‌ జన్మించాడు.ఇప్పుడు ఈ బాలుడు వయసు 5 నెలలు.అంటే, టేసియా ఇప్పుడు 6 మందితో కూడిన కుటుంబాన్ని నడిపిస్తోంది.చాలా మంది ఆమెను విమర్శిస్తున్నా, ఆమె ఎవరి మాటలను పట్టించుకోవడం లేదు.టేసియా చేసిన ఈ పని చాలా మందికి స్ఫూర్తిగా ఉంది.ఎందుకంటే, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రేమతో నిండిన కుటుంబం అవసరం అని ఆమె చూపించింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube