ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల జోరు పెరిగింది.ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ .ఇక ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు , కేటీఆర్ లు ఇటీవలే ఢిల్లీ కి వెళ్లి వారం రోజులు మకాం వేశారు. పైకి ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లినట్టుగా చెబుతున్నా , అంతర్గతంగా బీజేపీ లోని కొంతమంది కీలక నేతలతో చర్చలు జరిపారని, తెలంగాణలో బిజెపితో కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధంగా హరీష్ రావు , కేటీఆర్( Harish Rao, KTR ) లు ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఏ ప్రకటన చేయకపోవడం, ఢిల్లీ నుంచి రాగానే కేటీఆర్ తో ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ కావడం వంటివి చర్చనీయాంశంగా మారాయి .
కవిత బెయిల్ కోసం న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తూనే , మరోవైపు హరీష్ రావు బిజెపి కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం గత కొద్ది కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది.హరీష్ రావు బిజెపి లో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అటు బీఆర్ఎస్ , ఇటు బిజెపి వర్గాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్( Etela Rajender ) ను నియమిస్తారని బీఆర్ఎస్ లోని కీలక నాయకులను బిజెపిలో చేర్చడమే టార్గెట్ గా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
దీనిలో భాగంగానే హరీష్ రావును బిజెపిలో చేర్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది .తాజాగా ఈ వ్యవహారంపై ఈటెల రాజేందర్ స్పందించారు. హరీష్ రావు బిజెపి( BJP )లో చేరే ఆలోచనలో ఉంటే ఉండవచ్చని , దానికి అవకాశాలు ఉన్నాయని రాజేందర్ అన్నారు.
రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు అని, కాకపోతే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమి చెప్పలేనంటూ రాజేందర్ వ్యాఖ్యానించారు.