జుట్టును దృఢపరిచే దాల్చిన చెక్క.. ఎలా వాడాలంటే?

మన ఇండియన్ స్పైసెస్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో దాల్చిన చెక్క( Cinnamon ) ఒకటి.దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో దాల్చిన చెక్క ఉంటుంది.

 How To Use Cinnamon To Strengthen Hair Details, Cinnamon, Cinnamon Benefits, Ha-TeluguStop.com

నాన్ వెజ్, బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో దాల్చిన చెక్కను విరి విరిగా ఉపయోగిస్తారు.దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, మరిన్ని ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యానికి ఇది అండగా నిలుస్తుంది.అనేక జబ్బుల నుంచి రక్షిస్తుంది.

అలాగే జుట్టును( Hair ) దృఢపరిచే సామర్థ్యం కూడా దాల్చిన చెక్కకు ఉంది.

కేశ సంరక్షణకు దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అంగుళం దాల్చిన చెక్కల‌ను రెండు నుంచి మూడు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసుకున్న దాల్చిన చెక్కను కూడా వేసి చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Cinnamon, Cinnamon Oil, Care, Care Tips, Fall, Healthy-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఆయిల్ ను( Oil ) స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ దాల్చిన చెక్క ఆయిల్( Cinnamon Oil ) జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

Telugu Cinnamon, Cinnamon Oil, Care, Care Tips, Fall, Healthy-Telugu Health

దాల్చిన చెక్క రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.అలాగే దాల్చిన చెక్క యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.అందువల్ల వారానికి రెండు సార్లు దాల్చిన చెక్క ఆయిల్ వాడితే చుండ్రు ( Dandruff ) సమస్యను సుల‌భంగా వదిలించుకోవచ్చు.

అంతేకాదు దాల్చిన చెక్క ఆయిల్ జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.మరియు కురులను ఆరోగ్యంగా మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube