తెలంగాణ రాజకీయాల్లో తమకు తిరిగే లేదన్నట్లుగా వ్యవహరించిన బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మూడోసారి తామే అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసినా, అనూహ్యంగా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.
ఇక అప్పటి నుంచి బీ ఆర్ ఎస్ కు చెందిన వారు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన వారు, కేసీఆర్ తో ( KCR ) సన్నిహితంగా మెలిగిన వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళ్తుండడం వంటివి ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది .ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నేతలతో సమావేశం అవుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,( MLA Tellam Venakta Rao ) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,( MLA Danam Nagendar ) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు ఇదే బాట పట్టారు. దండే విటల్ , భాను ప్రసాద్ , ఎం ఎస్ ప్రభాకర్, మల్లేష్ , బొగ్గవరపు దయానంద్ బసవరాజ్ సారయ్యలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఇదిలా ఉండగానే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు బీఆర్ఎస్ లో మరింత ఆందోళన పెంచుతుంది.తలసాని శ్రీనివాస్ యాదవ్,( Talasani Srinivas Yadav ) సుదీర్ రెడ్డి ,( Sudheer Reddy ) కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, అరికెపూడి గాంధీలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన పెంచుతున్నాయి.