ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ( The Great Khali ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఈ రెజ్లర్ రింగ్‌లోకి దిగితే కల్లార్పకుండా భారతీయ ప్రజలు చూసేవారు.
వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ గా కూడా రాణించారు.గ్రేట్ ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా.
( Dalip Singh Rana ) ఈ రెజ్లింగ్ హీరో ఇటీవల ప్రపంచంలోనే అతి చిన్న మహిళ జ్యోతి అమ్గేను( Jyoti Amge ) కలిశారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, భూమిపై అత్యంత చిన్న మహిళగా( World’s Shortest Woman ) గుర్తింపు పొందిన జ్యోతి ఎత్తు కేవలం 62.8 సెం.మీ (2 అడుగులు 3 1/4 అంగుళాలు).ఒక వైరల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, ఖలీ ఒక చేత్తో జ్యోతిని సులభంగా ఎత్తారు.ఆమె నవ్వుతూ ఉండగా ఆమెను గాలిలో తిప్పుతూ ఆడుకున్నారు.
గ్రేట్ ఖలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో కామెంట్ల విభాగంలో మిశ్రమ స్పందనలు వచ్చాయి.కొందరు ఖలీ ప్రవర్తనను విమర్శించారు, ఆమె ఎంత పొట్టిదైన, ఒక పెద్ద మహిళ అని నొక్కిచెప్పారు.“ఇది పూర్తిగా తప్పు.ఖలీ, వ్యక్తిగతంగా మీరంటే నాకు ఇష్టం.కానీ ఇది సరైనది కాదు.
ఆమె బేబీ కాదు; ఆమె ఒక మహిళ.పరాయి మహిళను అలా ఎత్తుకోవడం ఎంతవరకు కరెక్టు?” అని ఓ యూజర్ కోపంగా కామెంట్ చేశాడు.ఇదొక బ్యాడ్ టచ్ అని పేర్కొన్నాడు.
ఇంకొందరు ఫన్నీ కామెంట్లు చేశారు.“సర్, ఆమెను ఎత్తివేసి ప్రపంచ పర్యటనకు పంపించండి.” అని ఒకరు సరదాగా కామెంట్ పెట్టారు.ఖలీకి అద్భుత శక్తులు ఉన్నాయంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు.ఆయన భౌతిక సామర్థ్యాలను ఫన్నీగా పోల్చారు.ఖలీ చుట్టూ తిరిగినప్పుడు, భూమి భ్రమణ వేగం పెరుగుతుందని, అతని తేపులు తుఫానులకు కారణమవుతాయని, అతను దూకేటప్పుడు భూకంపాలు సంభవిస్తాయని హిలేరియస్ కామెంట్లు చేశారు.అతని దవడ భారతదేశం – చైనా మధ్య ఒక సరిహద్దును సృష్టిస్తుందని అన్నారు.