గత కొన్నేళ్లలో స్టార్ హీరోయిన్ల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలోనే పెరిగాయి.కొంతమంది స్టార్ హీరోయిన్లు సినిమాలలో నటించాలంటే షాకింగ్ షరతులు విధిస్తుండటం గమనార్హం.
ఈ హీరోయిన్లు పెడుతున్న షరతుల గురించి తెలిసి షాకవ్వడం దర్శకనిర్మాతల వంతవుతోందని సమాచారం అందుతోంది.స్టార్ హీరోయిన్ నయనతార( Nayanthara ) ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా ప్రచారానికి మాత్రం దూరంగానే ఉంటారనే సంగతి తెలిసిందే.
మరో స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) సాయంత్రం 6 గంటల తర్వాత మేకప్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా( Sonakshi Sinha ) సైతం ఇలాంటి ఒక నిబంధనను పాటిస్తారు.
ఈ స్టార్ హీరోయిన్ తాను బోల్డ్ రోల్స్ లో అస్సలు నటించనని తేల్చి చెబుతున్నారు.తెరపై బోల్డ్ సీన్స్ లో తాను నటించే ఛాన్స్ లేదని ఆమె వెల్లడిస్తున్నారు.
సోనాక్షి సిన్హాకు నటిగా 35 సినిమాల అనుభవం ఉంది.
అయితే ఇన్ని సినిమాల అనుభవం ఉన్నా ఈ బ్యూటీ మాత్రం తాను బోల్డ్ సీన్స్( Bold Scenes ) చేయనని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. లిప్ కిస్ సన్నివేశాల్లో, శృంగార సన్నివేశాల్లో నటించలేదనే బాధ మాత్రం నాలో లేదని ఆమె కామెంటు చేస్తుండటం గమనార్హం.బోల్డ్ సీన్స్ చేయడం నాకు అసౌకర్యంగా ఉంటుందని దర్శకనిర్మాతలకు ముందే చెబుతానని ఈ బ్యూటీ కామెంట్లు చేశారు.
నేను అలా చెప్పిన తర్వాత ఆ సినిమాలో తీసుకుంటారో లేదో దర్శకనిర్మాతల ఇష్టమని సోనాక్షి సిన్హా కామెంట్లు చేశారు.నా సినిమాలకు సంబంధించి నా నిర్ణయం ఎప్పటికీ మారదని సోనాక్షి సిన్హా తేల్చి చెప్పగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.దబాంగ్ సినిమాతో( Dabangg ) కెరీర్ మొదలుపెట్టిన సోనాక్షి కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే చెప్పాలి.సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్ పరంగా సైతం టాప్ లో ఉన్నారు.