భూమ్మీద ఇంతటి తెలివైన వ్యక్తి పుట్టడేమో.. ఐఏఎస్ జాబ్ సింపుల్‌గా వదిలేశారు..!!

ఈ రోజుల్లో సాధారణంగా రెండు, మూడు యూనివర్సిటీ డిగ్రీలు పూర్తి చేయడానికే విద్యార్థులు ఆపసోపాలు పడుతున్నారు.అలాంటిది ఒక వ్యక్తి మెరిట్ మార్కులతో 20 యూనివర్సిటీ డిగ్రీలు పూర్తి చేశారు.

 Shrikant Jichkar Talents And Degrees , Upsc Civil Service , Shrikant Jichkar , U-TeluguStop.com

రెండుసార్లు యూపీఎస్సీ పరీక్షలు పాస్ అయ్యారు.ఐపీఎస్, ఐఏఎస్ జాబులను తృణప్రాయంగా వదిలేశారు.

ఆయన మరెవరో కాదు మరాఠీ వ్యక్తి శ్రీకాంత్ జిచ్‌కర్ ( Shrikant Jichkar ).ఇతన్ని సరస్వతీపుత్రుడు, అపర మేధావి అని పిలుస్తుంటారు.మొదటి తెలివైన వ్యక్తి 49 ఏళ్లకే చనిపోయి తీరని శోకాన్ని మిగిల్చారు.ఆయన జీవితం ఎలా సాగిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శ్రీకాంత్ జిచ్‌కర్ ఒక మరాఠీ కుటుంబంలో 1954 సెప్టెంబర్ 14న జన్మించారు.ఆయన మొదట వైద్యశాస్త్రంలో డిగ్రీలు ( MBBS, MD ) పొందారు.

ఆ తరువాత, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ లో డాక్టరేట్, జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ, సంస్కృతంలో డాక్టరేట్ డిగ్రీ సాధించారు.పాబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సంస్కృతం, చరిత్ర, ఆంగ్ల సాహిత్యం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, పురాతన భారత చరిత్ర, సంస్కృతి పురావస్తు శాస్త్రం, మనస్తత్వశాస్త్రం వంటి పది మాస్టర్ డిగ్రీలు కూడా సాధించారు.

Telugu Maharashtra, Marathi, Mbbs, Shrikantjichkar, Upsc Civil-Telugu Top Posts

ఆయన చాలా డిగ్రీలను ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యారు, అనేక బంగారు పతకాలు కూడా గెలుచుకున్నారు.1973 నుంచి 1990 వరకు, ప్రతి వేసవి, శీతాకాలంలో ఆయన 42 యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాశారు.1978లో, శ్రీకాంత్ జిచ్‌కర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్( UPSC Civil Service ) పరీక్షకు హాజరయ్యారు.అందులో పాసయ్యి ఐపీఎస్ గా ఎంపికయ్యారు.

కానీ, కొంతకాలం తరువాత, ఆయన ఆ కేడర్ నుంచి రాజీనామా చేసి, 1980లో మరోసారి సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యారు.ఈసారి ఐఏఎస్ అయ్యారు.అయితే, సేవలో చేరిన నాలుగు నెలల తర్వాత ఐఏఎస్ జాబ్ కు సింపుల్ గా రిజైన్ చేశారు.ఆయన మొదటిసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ పని చేశారు.

ఆ ఎన్నికల్లో గెలిచి, 26 సంవత్సరాల వయస్సులో దేశంలోనే అతి చిన్న ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.ఆ తరువాత మంత్రి అయ్యారు, ఒకేసారి 14 శాఖలకు మంత్రిగా పనిచేసే తన తెలివిని చాటుకున్నారు.

Telugu Maharashtra, Marathi, Mbbs, Shrikantjichkar, Upsc Civil-Telugu Top Posts

శ్రీకాంత్ మహారాష్ట్రలో ( Maharashtra )ప్రముఖ రాజకీయ నాయకుడిగా రాణించారు.1992-1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.1992లో నాగ్‌పూర్‌లో సాందీపనీ స్కూల్‌ను స్థాపించారు.అయితే దురదృష్టవశాత్తు 2004 జూన్ 2న కొండ్‌హాలి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.

ఈ ప్రమాదంలో ఆయనతో పాటు వెళ్లిన ఆయన బంధువు శ్రీరామ్ ధవడ్ తీవ్రంగా గాయపడ్డారు.ఆయన మరణం మహారాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద షాక్‌లా తగిలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube