ఎలాంటి కోచింగ్ లేకుండా చిన్నచిన్న ఉద్యోగాలు సాధించడం సులువే అయినా సివిల్స్ ర్యాంక్( Civils Rank ) సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి ప్రశంసలు అందుకుంటున్న వాళ్లలో దొనక పృథ్వీరాజ్( Prithviraj ) ఒకరు.
పార్వతీపురంలో నివాసం ఉంటున్న పృథ్వీరాజ్ తాజాగా రిలీజైన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మూడో ప్రయత్నంలో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ తన స్వస్థలం కురుపాం( Kurupam ) అని నాన్న ఎంఈవోగా పని చేశారని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే సివిల్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టానని ఆయన తెలిపారు.సివిల్స్ లక్ష్య సాధన కోసం మొదట రోజుకు 8 గంటల ప్రిపరేషన్ సాగించానని ఆ తర్వాత రోజుకు 11 గంటల ప్రిపరేషన్ సాధించానని వెల్లడించారు.

నేను మెయిన్స్ పై( Mains ) ఎక్కువగా దృష్టి పెట్టానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.ఈ ఏడాది స్కోరింగ్ రావాలని ఎక్కువగా కష్టపడ్డాననని ఆయన అన్నారు.సివిల్స్ లక్ష్యంగా పెట్టుకునే వాళ్లు ఈ దిశగా ప్రిపేర్ అయితే బాగుంటుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.నా సక్సెస్ లో తల్లీదండ్రుల ప్రోత్సాహం మరవలేనిదని ఆయన వెల్లడించారు.వారు అడుగడుగునా అండగా నిలిచారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నాన్న హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.అమ్మ ప్రభుత్వ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సివిల్స్ ప్రిపేర్ కావాలని భావించే వాళ్లు పృథ్వీరాజ్ ను స్పూర్తిగా తీసుకుంటే కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగే అవకాశాలు ఉంటాయి.పృథ్వీరాజ్ సక్సెస్ తో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.