రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.జిల్లా ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.
1.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఇంస్టాగ్రామ్ లో ఐపీఎల్ టికెట్స్ సేల్ అనే లింకు చూసి లింక్ క్లిక్ చేయగా వాట్సాప్ లో మెసేజ్ చేశారు ఐపీఎల్ టికెట్స్ కావాలనుకుంటే వాళ్ళు పంపించిన స్కానర్స్ కి అమౌంట్ పంపియమని చెప్పారు బాధితుడు అది నమ్మి 32 వేల రూపాయలు పంపించారు కానీ టికెట్స్ రాలేదు అపుడు సార్ జరిగిందని తెలిసి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశారు.
2.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిగ్రామ్ యాప్ లో పార్ట్ టైం జాబ్ ఇస్తామని చెప్పి ఆన్లైన్లో డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి టెలిగ్రామ్ లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు ఇనిషియల్ గా అమౌంట్ ఇచ్చారు తర్వాత టాస్కులు ఉంటాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నమ్మించారు ఆ విధంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.
3.వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఓఎల్ఎక్స్ లో సోఫా అమ్ముతా అని అడ్వర్టైజ్మెంట్ పెట్టడం జరిగింది అది చూసిన సస్పెక్ట్ బాధితునికి కాల్ చేసి తనను హోల్సేల్ గా పరిచయం చేసుకొని బాధితునికి QR కోడ్ స్కానర్స్ పంపించడం జరిగింది అవి స్కాన్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయని బాదితున్ని నమ్మించగా బాదితుడు స్కాన్ చేయడంతో 98 వేల రూపాయలు లాస్ అయ్యారు.
4.గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్బుక్లో ఈ కామర్స్ ప్లాట్ఫారం నుండి మీకు గిఫ్ట్ ఓచర్ వచ్చింది అని లింక్ చూసి ఆ లింకును క్లిక్ చేయడం జరిగింది వెంటనే యూపీఐ పిన్ అడగగా బాధితుడు తనకే అమౌంట్ వస్తాయి అనుకొని యూపీఐ పిన్ ఎంటర్ చేయడం జరిగింది దాంతో 5000 రూపాయలు నష్టపోయారు
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా క్రింది జాగ్రత్తలు పాటించండి.
• మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి.మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.
ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.• సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.• మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.
అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.