గెలుపు పై లోకేష్ అంత ధీమాగా ఉన్నారా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) మరోసారి మంగళగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.2019 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna Reddy )చేతిలో ఓటమి చెందారు.దీంతో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న లోకేష్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.2019లో మంగళగిరిలో ఓటమి చెందిన ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు.  తరచుగా అక్కడ పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారు.అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

 Is Lokesh So Slow To Win, Tdp, Janasena, Ysrcp, Telugudesam, Mangalagiri Consten-TeluguStop.com

ఈసారి జరిగే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు తప్పకుండా తనను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో లోకేష్ ఉన్నారు.

Telugu Allaramakrishna, Lokesh Slow Win, Janasena, Kandru Kamala, Telugudesam, Y

2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి ఓటమి చెందిన అక్కడ పార్టీ నాయకులు ,ప్రజలతో సన్నిహితంగానే మె లుగుతూ , సందర్భం వచ్చినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గంలో( Mangalagiri Constituency ) పర్యటిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం లోకేష్ కు ప్రత్యర్థిగా వైసిపి నేత కాండ్రు హనుమంతరావు కోడలు లావణ్య కు ఇక్కడ టికెట్ ఇచ్చారు .కమల, హనుమంతరావుకు ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉండడం, చేనేత సామాజిక వర్గానికి చెందినవారు కావడం , ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఆ సామాజిక వర్గం వారే  కావడంతో ,లోకేష్ ను తప్పకుండా ఓడించగలమనే ధీమాతో వైసిపి ఉండగా,  ఈసారి మాత్రం గెలిచేది తానేనని లోకేష్ నమ్మకంతో ఉన్నారు .

Telugu Allaramakrishna, Lokesh Slow Win, Janasena, Kandru Kamala, Telugudesam, Y

లోకేష్ తో పాటు , చంద్రబాబు ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఎన్నికల మేనేజ్మెంట్,  బూత్ మేనేజ్మెంట్ ఇలా అన్ని విషయాల పైన , లోకేష్ తో పాటు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.ఇక్కడ గెలవడమే కాదు, కనీసం 50 వేలకు పైగా మెజారిటీ సాధించాలనే లక్ష్యంగా లోకేష్ పెట్టుకున్నారు.అందుకే రాష్ట్రవ్యాప్త పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, ఎక్కువగా మంగళగిరి పైనే ఫోకస్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube