Singer Harika Narayan : పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ స్టార్ సింగర్ హారికా నారాయణ్.. వరుడు ఎవరంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరీ తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అందులో భాగంగానే ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) తన ప్రియుడు జాకీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.

 Singer Harika Narayan Will Get Married-TeluguStop.com

ఇప్పుడు మరొక సింగర్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది.ఆమె మరెవరో కాదు టాలీవుడ్ ప్రముఖ సింగర్ హారికా నారాయణ్‌.

( Singer Harika Narayan ) ఈమె త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఆమె అధికారికంగా తెలిపారు.వరుస స్టేజ్‌ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకెళ్తోన్న హారికా పలు పాటలతో లక్షల మందిని ఉత్సాహపరిచారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక అనుకుంటే హీరోయిన్‌గా కూడా రాణించవచ్చు.ఎందుకంటే హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం.తాజాగా హారికా నారాయణ్‌ తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటితో( Prudhvinath Vempati ) కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె తెలిపారు.వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పిడిన పరిచయం ఆపై ప్రేమగా మారిందని తెలిపిన ఆమె ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగినట్లు తెలిపింది హారికా.

వారిద్దరు రింగ్స్ ని మార్చుకుంటున్న ఫోటోను హారికా షేర్‌ చేశారు.

కానీ తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు షేర్‌ చేయలేదు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా ఈమె నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్‌ రోజ్‌) అనే సాంగ్ తో యూత్‌కు కనెక్ట్‌ అయ్యారు.విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారికా.90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్‌ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది.హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube