సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు చిన్న హీరోగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఇప్పటికీ కూడ యంగ్ హీరోలకు పోటీని ఇచ్చే విధంగా సినిమాలు చేస్తూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో తను ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు.సీనియర్ హీరోలకు ఎవరికి సాధ్యం కానీ విధంగా వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veeraiah )తో 250 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు.
ఇక ఇప్పుడు విశ్వంభర( Vishwambara ) అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి చేసిన ‘రౌడీ అల్లుడు ‘ సినిమాలో చిరంజీవి ఐరన్ లెగ్ శాస్త్రి కాంబో లో వచ్చే సీన్ల ను చాలా ఎక్కువ సేపు చిత్రీకరించారట, ఎందుకు అంటే చిరంజీవి టెంపో ను ఐరన్ లెగ్ శాస్త్రి మెయింటైన్ చేయలేకపోతున్నాడు.కాబట్టి ఇద్దరి మధ్య చెప్పే డైలాగులు గానీ, ఎక్స్ప్రెషన్స్ గాని సరిగ్గా మ్యాచ్ కావడం లేదు.దాని వల్ల చిరంజీవి చాలా సేపు ఆ సీన్లని రీటేక్ లు చేయాల్సి వచ్చింది.
ఇక ఒకానొక టైంలో ‘నాకు ఈ యాక్టింగ్ వద్దు బాబోయ్ అని దండం పెట్టి మరి పారిపోవాలనిపించేత చిరాకు తెప్పించిందంట’, అయితే అన్ని టేకులు తీసుకునేసరికి చిరంజీవికి ఏం చేయాలో తెలియక చిరాకు పుట్టేసింది.నిజానికి దాంట్లో చిరంజీవి తప్పేం లేదు అలాగే ఐరెన్ లెగ్ శాస్త్రి( Iron leg Sastri ) తప్పు కూడా ఏం లేదు.చిరంజీవి లాంటి స్టార్ నటుడితో నటించేటప్పుడు తను కొంచెం కంగారు పడిపోయి డైలాగులు మర్చిపోవడం, ఎక్స్ప్రెషన్ మిస్ చేయడం లాంటివి చేయడం వల్లే ఇలాంటి మిస్టేక్స్ జరగాయని ఆయన చేయకపోయేసరికి చిరంజీవి బాగా చేసిన కూడా వాళ్లిద్దరి మధ్య కామెడీ( Comedy ) అనేది సెట్ అవ్వకపోవడం తో చిరంజీవి కూడా భాద పడాల్సి వచ్చిందని అప్పట్లో సినిమా యూనిట్ చాలా క్లారిటీగా తెలియజేశారు…
.