సక్సెస్ సాధించడం చాలా కష్టమని మనలో ఎక్కువమంది భావిస్తారు.అయితే సరైన ప్రణాళికతో ప్రయత్నిస్తే మాత్రం సక్సెస్ సాధించడం ఏ మాత్రం కష్టం కాదని ప్రూవ్ చేసిన వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
జీవితం ఎన్ని కష్టాలు ఎదురైనా ఏదో ఒకరోజు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని తమిళనాడులోని తిరుపట్టూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి( v sripathi ) ప్రూవ్ చేశారు.
23 సంవత్సరాల వయస్సులోనే సివిల్ జడ్జి( Civil Judge )గా అర్హత పొందిన శ్రీపతి తమిళనాడులో తొలి గిరిజన మహిళా జడ్జి కావడం గమనార్హం.కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కూతురుగా జన్మించిన వి.శ్రీపతి బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారు.కూతురిని మంచి చదువు చదివించాలని కలియప్పన్ కూతురు కోసం యలగిరి హిల్స్ కు మకాం మార్చారు.
అక్కడ శ్రీపతి ఇంటర్ వరకు చదువుకున్నారు.
ఇంటర్ పూర్తైన తర్వాత శ్రీపతి లా చదవాలని భావించారు.ప్రసవమై ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే చెన్నై) లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్( Tamil Nadu Public Service Commission ) పరీక్ష రాసి శ్రీపతి సివిల్ జడ్జ్ పరీక్షకు అర్హత సాధించారు.కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసే కుటుంబానికి చెందిన శ్రీపతి సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
శ్రీపతి సక్సెస్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.గిరిజనులకు ఉన్న చట్టబద్ధమైన హక్కుల గురించి వాళ్లకు తెలియదని వాళ్లను చైతన్య వంతం చేయాలని ఆమె చెప్పుకొచ్చారు.శ్రీపతి భర్త వెంకటేశన్ ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి సైతం శ్రీపతికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ జనరేషన్ లో ఎంతోమందికి శ్రీపతి ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.శ్రీపతి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.