ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కు బదిలీ చేయాలన్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ( CM Revanth Reddy )వ్యక్తిగతంగా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
అలాగే ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది.అనంతరం నాలుగు వారాల్లో స్పందించాలని సుప్రీం ధర్మాసనం నోటీసుల్లో పేర్కొంది.అయితే ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.