ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రెండు గ్యారెంటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఈనెల 8వ తారీఖు నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు( Telangana budget meetings ) జరగనున్నట్లు సమాచారం.పదవ తారీఖున ఓట్ ఆన్ అకౌంట్.
బడ్జెట్ నీ ప్రభుత్వం ప్రవేశపెట్టన్నట్లు 12వ తారీకు నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్.
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయడం జరిగింది.రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ( Arogyashri ) ఫీజు పెంపు వంటి గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది.మిగతా గ్యారెంటీలను కూడా త్వరితగితనా అమలు చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో గెలవడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను టీకాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా అందరూ కష్టపడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.