ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇదే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ ( Smart phone )తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త వేరియంట్లను లాంచ్ చేస్తూ ఉండడంతో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఎప్పుడు పోటీ వాతావరణమే ఉంటుంది.ఈమధ్య ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి.

 This Is The Thinnest Foldable Smart Phone In The World.. What Are The Features,-TeluguStop.com

శాంసంగ్, మోటోరోలా లాంటి కంపెనీల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లకు పోటీగా హానర్ కంపెనీ ఓసారి కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.ఆ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Company, Magic, Smart Phone, Smart, Technolgy, Technoly-Technology Telugu

ముఖ్యంగా హానర్ కంపెనీ( Honor ) లాంచ్ చేసిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ ప్రకటించింది.ఈ ఫోన్ కేవలం 9.9 MM థిక్ నెస్ ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ పేరు హానర్ మ్యాజిక్ వీ2.

Telugu Company, Magic, Smart Phone, Smart, Technolgy, Technoly-Technology Telugu

హానర్ మ్యాజిక్ వీ2 స్మార్ట్ ఫోన్( H‌onor magic v2 ) బయటి వైపు స్క్రీన్ 6.43 అంగుళాల 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో OLED డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ఫోన్ 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2.5*20 ఎంపీ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో ఉంటుంది.సెల్ఫీల కోసం 60mp ఫ్రంట్ కెమెరా ఉంటుంది.LTPO కవర్ స్క్రీన్ తో శక్తివంతమైన విజువల్స్ అందిస్తుంది.2500 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ స్క్రీన్ సంరక్షణకు నానో క్రిస్టల్ గ్లాస్ ప్రొడక్షన్ 7.92 అంగుళాల LTPO OLED ప్యానల్ కలిగి ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ 16GB RAM+ 512GB స్టోరేజ్ తో ఉంటుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్లో ఉండే బ్యాటరీ డ్యూయల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.యూరప్ లో దీని ధర 1699.99 యూరోలు ఉంటుంది.మన భారత కరెన్సీలో రూ.153507.56 గా ఉంటుంది.ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube