ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) పేరే వినిపిస్తోంది.అందుకు కారణం టాలీవుడ్ మెగాస్టార్‌కు అరుదైన గౌరవం లభించడమే.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ ( Padmavibhushan )వరించిన విషయం తెలిసిందే.దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించినందుకు గాను మెగాస్టార్ కి ఈ అవార్డు వరించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు ( Mohan Babu, Vishnu )రియాక్ట్ అయ్యారు.నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు.ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.
అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను అని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.
చాలా సంతోషం అనిపించింది.చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.
మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వరలగా మారింది.కాగా చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిరు ఇంటికి వెళ్లి కలిశారు.
ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన అల్లు అర్జున్ మెగాస్టార్కు ఆ అవార్డు వరించడం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేసిన విషయం తెలిసిందే.