తెలుగులో ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తాప్సీ( Taapsee ) ఒకరు.డంకీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న తాప్సీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ వీసా రూల్స్( Visa Rules ) గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.
వీసా కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న రూల్స్ కఠినంగా ఉన్నాయని ఆమె అన్నారు.సమాజంలోని పేదవాళ్లకు అవి వర్తించడం దురదృష్టకరమని తాప్సీ చెప్పుకొచ్చారు.
అవసరమైనంత బ్యాంక్ బ్యాలెన్స్ ను( Bank Balance ) చూపించి ధనవంతులు సులువుగా వీసా పొందగలరని ఆమె అన్నారు.తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తాప్సీ పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని తాప్సీ వెల్లడించడం గమనార్హం.తక్కువ ఆదాయం వల్ల డంకీ( Dunki Movie ) యూనిట్ లోని చాలామంది ఇబ్బందులు పడ్డారని తాప్సీ పేర్కొన్నారు.
ప్రస్తుతం తాప్సీ ఫిర్ అయీ హసీన్ దిల్ రుబా( Phir Aayi Haseen Dilruba ) సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది.హసీన్ దిల్ రుబాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలోని పాత్ర నటిగా నన్ను సవాల్ చేసిన రోల్ అని ఆమె అన్నారు.ఇలాంటి రోల్ లో నటించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నానని తాప్సీ చెప్పుకొచ్చారు.తాప్సీ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సీకి భారీ స్థాయిలో పారితోషికం దక్కుతోందని తెలుస్తోంది.తాప్సీ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.తాప్సీ కథ అద్భుతంగా ఉంటే తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమేనని తెలుస్తోంది.
తాప్సీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.తాప్సీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.