తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj )) తెలిపారు.ఈ తరహాలోనే లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 8న తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
దాదాపు తొమ్మిది లక్షల మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే( National Voters Day ) సందర్భంగా వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్( Governor Tamilisai Soundararajan ) తో పాటు సీఈవో వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి తదితరులు హాజరయ్యారు.