సిరుల మాగాణి సింగరేణి( Singareni )లో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.మెడికల్ ఇన్ వాలిడేషన్ నియామకాల్లో పలు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది.దీనిపై రంగంలోకి దిగిన సింగరేణి యాజమాన్యం ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంపైనే సింగరేణి ఎండీ బలరాం( Singareni MD Balaram ) ఏసీబీకి లేఖ రాశారు.ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ రమేశ్ నేతృత్వంలో సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.