అయోధ్యలో బాలరాముడు( Balarama in Ayodhya ) కొలువుదీరిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని చాలామంది దంపతులు ఈ నెల 22వ తేదీన కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే.కొంతమంది సిజేరియన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రాణప్రతిష్ట రోజు పిల్లాడు పుడితే నిజంగా శ్రీరాముడే తమ ఇంట పుట్టాడేమో అని చాలామంది భావించారు.అయితే ప్రాణప్రతిష్ట రోజు పుట్టిన తన కొడుకుకు ఒక మహిళ రామ్ రహీం అని పేరు పెట్టారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.ఆ మహిళ పేరు ఫర్జానా( Farzana ) కాగా తల్లి, బిడ్డ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం అందుతోంది.
శిశువు అమ్మమ్మ బిడ్డకు తల్లి సూచనల మేరకు రామ్ రహీం( Ram Rahim ) అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది.అమ్మమ్మ హుస్నా భాను( Husna Bhanu ) మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రామ్ రహీం అని పేరు పెట్టామని వెల్లడించడం గమనార్హం.
నిన్న మగబిడ్డ చాలామంది రామ్ అని పేరు పెట్టగా ఆడపిల్ల పుడితే చాలామంది సీత అని పేరు పెట్టారు.బీహార్ లోని పాట్నాలో ఉన్న వేర్వేరు ఆస్పత్రులలో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు తెలుస్తోంది.మధ్యప్రదేశ్ లోని మూడు జిల్లాలలో వేర్వేరు ఆస్పత్రులలో సోమవారం 47 మంది జన్మించినట్లు భోగట్టా.మరి కొందరు తమ పిల్లలకు రాఘవ్, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర అనే పేర్లను పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సైతం నిన్న వందల సంఖ్యలో శిశువులు జన్మించినట్లు తెలుస్తోంది.అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది.నిన్న తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు సైతం ఈ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం అందుతోంది.అయోధ్య రామప్రతిష్ట కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.