హైదరాబాద్ కు చేరిన గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ..!!

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి( Giddalur YCP Candidate ) పంచాయతీ హైదరాబాద్ కు చేరింది.అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంపై గత మూడు రోజులుగా స్థానిక నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas ) చర్చిస్తున్నారు.

 Panchayat Of Giddalur Ycp Candidate Reached Hyderabad Details,ex Minister Baline-TeluguStop.com

సీటు దక్కించుకునేందుకు ఆశావహులు హైదరాబాద్ లో తిష్టవేశారు.ఈ క్రమంలోనే నాయకులతో చర్చించి వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకు రావాలని బాలినేని ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను బరిలో దిగబోనని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు( Anna Rambabu ) ప్రకటించడంతో ఈ సారి సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.కాగా గిద్దలూరు సీటును ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కామూరి రమణారెడ్డి, ఐవీ రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి ఉన్నారు.వీరిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సీఎం జగన్ ను కలిశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube