‘‘ నియంత ’’ అంటూ ఆందోళనకారుడి నినాదాలు .. ‘Get Him Out’ అన్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది.రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అందరికంటే ముందున్నారు.

 ‘‘ నియంత ’’ అంటూ ఆందోళనకారుడి-TeluguStop.com

ఈ పార్టీలో ట్రంప్‌కు పోటీ అవుతాడనుకున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అనూహ్యంగా రేసు నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో( Republican Party ) ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్య పోరు నడుస్తోంది.

ఈ క్రమంలో ట్రంప్ తన నోటికి పనిచెప్పారు.శనివారం రాత్రి మాంచెస్టర్‌లో( Manchester ) జరిగిన ర్యాలీలో ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించారు.

తన మానసిక ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ఇదే సమయంలో ర్యాలీకి హాజరైన గుంపులో ఓ వ్యక్తి ట్రంప్‌ను ‘‘డిక్టేటర్ (నియంత)’’ అని నినాదాలు చేయడం కలకలం రేపింది.

Telugu Donald Trump, Protester, Manchester, Nikki Haley, Republican, Ron Desanti

దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్.వెంటనే అతన్ని బయటకు పంపండి అంటూ భద్రతా సిబ్బందిని ఆదేశించారు.ట్రంప్ ఆదేశాలతో ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టి, తక్షణం వేదిక నుంచి బయటకు పంపారు.అనంతరం మాజీ అధ్యక్షుడు ప్రసంగిస్తూ.ప్రస్తుతం రాజకీయాలు తీవ్రంగా మారుతున్నాయని తనకు తెలుసునని అన్నారు.తాను అధ్యక్షుడిగా వుండేందుకు మానసికంగా దృఢంగా లేనంటూ వ్యాఖ్యానించిన నిక్కీ హేలీపై( Nikki Haley ) ట్రంప్ విమర్శలు గుప్పించారు.

తన మనసు 25 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బలంగా వుందని భావిస్తున్నానని చెప్పారు.

Telugu Donald Trump, Protester, Manchester, Nikki Haley, Republican, Ron Desanti

కాగా.ట్రంప్ ర్యాలీలో( Trump Rally ) పాల్గొనేందుకు చాలా మంది టికెట్ హోల్డర్లు గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా గంటల తరబడి వేచి చూశారు.కానీ వారికి ఎంట్రీ దొరకలేదు, దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత వీరిలో కొందరు భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ప్రతి ఒక్కరూ ట్రంప్‌ను చూడాలని అనుకుంటున్నారని కనెక్టికట్ నివాసి జేమ్స్ బ్యూడియన్ చెప్పారు.న్యూ హాంప్ షైర్ కు చెందిన కేథరీన్ జాన్సన్ మాట్లాడుతూ.న్యూ హాంప్ షైర్ పౌరుల గురించి ట్రంప్ పట్టించుకుంటాడని తాను అనుకోవడం లేదన్నారు.ఆయనెప్పుడూ అబద్ధంతో నోరు తెరుస్తాడని కేథరీన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube