బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వం చేసిన అవకతవకులు బయటపెడుతుంది.2014లో కేంద్రంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పడిన కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.2014, 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే నిలిచింది.కానీ గత ఏడాది 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.

 Deputy Cm Bhatti Vikramarka Serious Comments On Brs Congress, Mallu Bhatti Vikra-TeluguStop.com

ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే గతంలో పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్న దానిపై అనేక విషయాలు బయటపెడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిపిన ప్రాజెక్టులు ఇంకా అనేక విషయాలలో జరిగిన డొల్లతనం అన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) గత బీఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని వ్యాఖ్యానించారు.‘దుమ్ముగూడెం( Dummugudem ) అంచనా వ్యయం ₹1,681 కోట్లు కాగా 2014 కంటే ముందే ₹889 కోట్లు ఖర్చయ్యింది.ఇందిరా సాగర్ అంచనా ₹1,824 కోట్లు కాగా ₹1,064 కోట్లు వ్యయమైంది.

ఈ ప్రాజెక్టులకు ₹1,552 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీరందేది.అయితే KCR సీతారామ ప్రాజెక్టు పేరిట ₹18,500 కోట్లకు ఎసరు పెట్టారు’ అని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube