టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..ఎన్ని రికార్డులు బద్దలు చేశాడంటే..?

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్( India vs Afghanistan ) మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్( T20 series ) ను భారత్ కైవసం చేసుకుంది.వరుసగా మూడు మ్యాచ్లు విజయం సాధించి, టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

 Rohit Sharma Who Created A New History In T20 How Many Records Did He Break , In-TeluguStop.com

తాజాగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి పలు సరికొత్త రికార్డులు సృష్టించాడు.ఈ టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లలో డకౌట్ గా వెనుదిరిగిన రోహిత్ శర్మ మూడవ మ్యాచ్లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు.

Telugu Rinku Singh, Rohit Sharma-Sports News క్రీడలు

బెంగుళూరు వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్( T20 match ) లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది టీం ఇండియా.పవర్ ప్లే లోనే యశస్వి జైస్వాల్ 4, విరాట్ కోహ్లీ 0, శివం దూబే 1 , సంజూ శాంసన్ 0 రూపంలో భారత జట్టు కీలక వికెట్లను కోల్పోయింది.రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్ కు రింకూ సింగ్( Rinku Singh ) తోడయ్యాడు.దీంతో రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 121 పరుగులు చేసి అజయంగా నిలిచాడు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.అంతేకాదు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు.తర్వాత స్థానంలో భారత జట్టు ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ 4 సెంచరీలతో రెండవ స్థానంలో నిలిచాడు.

Telugu Rinku Singh, Rohit Sharma-Sports News క్రీడలు

అంతేకాదు కోహ్లీ పేరిట ఉండే ఒక రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.విరాట్ కోహ్లీ టీ20ల్లో 1570 పరుగులతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా ఉన్నాడు.అయితే ఈ రికార్డును బద్దలు కొట్టి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్ గా అవతరించాడు.రోహిత్ శర్మ 1643 పరుగులు చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఈ టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన రోహిత్ శర్మ చివరి మ్యాచ్లో మాత్రం చరిత్రలో నిలిచిపోయే రికార్డులు సృష్టించి తన పేరిట లిఖించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube