ఆరు నెలలు నిండిన పిల్లలకు ఏయే పండ్లు ఇవ్వొచ్చో తెలుసా?

సాధారణంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి తల్లి పాలే ఆహారం.ఆరు నెలలు వచ్చే వరకు పిల్లలకు పాలు మాత్రమే పట్టిస్తారు.

 Do You Know Which Fruits Can Be Given To Six Months Old Children Children, Fruit-TeluguStop.com

ఆరు నెలలు నిండిన తర్వాత ఘన ఆహారాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.ఈ నేపథ్యంలోనే ఆరు నెలలు నిండిన పిల్లలకు ఏయే పండ్లు ఇవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు ఆరు నెలలు నిండిన‌ప్పటి నుంచి పిల్లలకు ఇవ్వదగ్గ పండ్లలో ఒకటి.అరటి పండును( Banana fruit ) నేరుగా పిల్లలకు పెట్టవచ్చు.ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున త్వరగా జీర్ణమవుతుంది.అదే స‌మ‌యంలో అర‌టిపండు పిల్లల్లో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

అలాగే అవకాడో( Avocado ) పండు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.చంటి పిల్లలకు కూడా అవకాడో పండు చాలా మంచిది.

Telugu Apple, Avocado, Fruits, Tips, Kiwi, Latest, Papaya-Telugu Health

అవకాడో లో ఉండే పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయి.ఆరు నెలలు నిండిన తర్వాత పిల్లలకు యాపిల్( Apple ) ను కూడా పెట్టడం స్టార్ట్ చేయొచ్చు.యాపిల్ ను ఉడికించి పిల్లలకు తినిపించాలి.యాపిల్ పిల్లల కడుపును నిండుగా, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.బ్రెయిన్ షార్ప్ గా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది.

Telugu Apple, Avocado, Fruits, Tips, Kiwi, Latest, Papaya-Telugu Health

ఆరు నెలలు నిండిన పిల్లలకు బొప్పాయి పండు ముక్కలు పెట్టవచ్చు.బొప్పాయి పండు( Papaya fruit ) రుచిగా ఉండటం వల్ల చాలా మంది పిల్లలు తినేందుకు ఇష్టపడతారు.పైగా బొప్పాయి పండులో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవన్నీ పిల్లల ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఇక కివీ పండును కూడా పిల్లలకు పెట్టవచ్చు.

కివీ పండును పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసి పిల్లలకు ఇవ్వాలి.కివి పండులో ఉండే విటమిన్ సి పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

అదే సమయంలో అనేక రకాల ఇన్ఫెక్షన్ల‌ నుంచి పిల్లలను కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube