ఈరోజుల్లో కొందరి మూర్ఖత్వానికి అవధులు లేకుండా పోతున్నాయి.ముఖ్యంగా వాహనదారులకు, వీరిలో చాలామంది త్వరగా ఇంటికి వెళ్లిపోవాలనే ధ్యాసలో ఉంటున్నారే తప్ప సేఫ్‌గా ఇంటికి చేరుకోవడంపై దృష్టి పెట్టడం లేదు.
వెరసి వారు ప్రమాదాల్లో( Accidents ) పడుతున్నారు లేదా ఇతరులను ప్రమాదాల్లో పడేస్తున్నారు.తాజాగా ఓ కారు ఓనర్( Car Owner ) కూడా తొందరపడి ఓ పిచ్చి పని చేశాడు.
కానీ అదృష్టం కొద్దీ అతడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కారును ఓ రైలు ( Train ) ఆల్‌మోస్ట్ ఢీకొట్టినట్లుగా కనిపించింది.నిజానికి గేటు మూసేసరికి కారు రైలు పట్టాలు దాటింది.
మరోవైపు కూడా గేటు క్రాస్ చేద్దామనే లోపు గేటు కిందికి వచ్చిసింది.దాంతో కారు ( Car ) అక్కడే ఇరుక్కుపోయింది.
మరోవైపు నుంచి పట్టాలపై ట్రైన్ రావడం మనం చూడవచ్చు.ఆ సమయంలో గేటు, రైలుకు మధ్య ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా కారు ఇరుక్కుపోవడం గమనించవచ్చు.
కారుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నంబర్ ప్లేట్ ఉంది.
సౌరభ్ అనే యూజర్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నాడు.“ఇది చాలా నారో ఎస్కేప్.( Narrow Escape ) రైలు కారుని కొద్దిగా పాడు చేసి ఉంటే బాగుండేది.అప్పుడు కారు యజమాని గుణపాఠం నేర్చుకునేవాడు.” అని సౌరభ్ ఒక క్యాప్షన్ రాసాడు.ఈ వీడియో ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో బాగా వైరల్ అయింది.దీనికి కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చాయి.వేలల్లో లైక్స్ వచ్చాయి.ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.
కారు యజమానిని పోలీసులు శిక్షించాలని కోరారు.
“కారు ఓనర్ చాలా మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసాడు, యూపీ పోలీసులు చర్య తీసుకోవాలి, రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసి ఇతడిపై కఠిన చర్యలు తీసుకునేలా చేయాలి, ఇది చాలా తెలివితక్కువ పని.” అని నెటిజన్లు పేర్కొన్నారు.