ఆరు నెలలు నిండిన పిల్లలకు ఏయే పండ్లు ఇవ్వొచ్చో తెలుసా?

సాధారణంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి తల్లి పాలే ఆహారం.ఆరు నెలలు వచ్చే వరకు పిల్లలకు పాలు మాత్రమే పట్టిస్తారు.

ఆరు నెలలు నిండిన తర్వాత ఘన ఆహారాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.ఈ నేపథ్యంలోనే ఆరు నెలలు నిండిన పిల్లలకు ఏయే పండ్లు ఇవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు ఆరు నెలలు నిండిన‌ప్పటి నుంచి పిల్లలకు ఇవ్వదగ్గ పండ్లలో ఒకటి.అరటి పండును( Banana Fruit ) నేరుగా పిల్లలకు పెట్టవచ్చు.

ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున త్వరగా జీర్ణమవుతుంది.అదే స‌మ‌యంలో అర‌టిపండు పిల్లల్లో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

అలాగే అవకాడో( Avocado ) పండు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.చంటి పిల్లలకు కూడా అవకాడో పండు చాలా మంచిది.

"""/" / అవకాడో లో ఉండే పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయి.

ఆరు నెలలు నిండిన తర్వాత పిల్లలకు యాపిల్( Apple ) ను కూడా పెట్టడం స్టార్ట్ చేయొచ్చు.

యాపిల్ ను ఉడికించి పిల్లలకు తినిపించాలి.యాపిల్ పిల్లల కడుపును నిండుగా, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

బ్రెయిన్ షార్ప్ గా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. """/" / ఆరు నెలలు నిండిన పిల్లలకు బొప్పాయి పండు ముక్కలు పెట్టవచ్చు.

బొప్పాయి పండు( Papaya Fruit ) రుచిగా ఉండటం వల్ల చాలా మంది పిల్లలు తినేందుకు ఇష్టపడతారు.

పైగా బొప్పాయి పండులో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవన్నీ పిల్లల ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఇక కివీ పండును కూడా పిల్లలకు పెట్టవచ్చు.

కివీ పండును పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసి పిల్లలకు ఇవ్వాలి.

కివి పండులో ఉండే విటమిన్ సి పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

అదే సమయంలో అనేక రకాల ఇన్ఫెక్షన్ల‌ నుంచి పిల్లలను కాపాడుతుంది.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?