Anasuya : రంగురంగుల చీర కట్టి రంగువల్లులతో అనసూయ సంక్రాంతి సెలబ్రేషన్స్!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో అనసూయ ( Anasuya ) ఒకరు.జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 Anasuya Bharadwaj Sankranthi Festival Look Is Going Viral-TeluguStop.com

ఇలా మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందుకుంటున్న పాత్రలలో నటిస్తున్నటువంటి ఈమెకు రంగస్థలం సినిమా( Rangasthalam ) మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి.ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి అనసూయ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇలా ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

వరుస సినిమాలలో నటిస్తూ మరోవైపు జబర్దస్త్ కార్యక్రమాలలో కొనసాగుతూ ఉన్నటువంటి అనసూయకు రెండు బ్యాలెన్స్ చేయడం కుదరడం లేదు దీంతో ఈమె తప్పనిసరి పరిస్థితులలో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.దీంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి అనసూయ ప్రస్తుతం వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద హీరోల సినిమాల వరకు ఈమె కీలకమైనటువంటి పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె తన ఇంట్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్( Sankranthi Celebrations ) కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ పండుగ సందర్భంగా ఈమె చీర కట్టుకొని కీరాక్ లుక్ లో కనిపించారు.

రంగురంగుల చీర, డీప్ నెక్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.అందంతో కట్టిపడేసింది. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగు ముగ్గులు ప్రత్యేక అనసూయ కూడా ఇంటిముందు అద్భుతమైనటువంటి ముగ్గులను వేసి తన ఇంటి ఆవరణ మొత్తం రంగుల మయం చేయడమే కాకుండా ఈమె కూడా రంగురంగుల చీర ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

అదేవిధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చీరలో అనసూయ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటూ ఈ ఫోటోల పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube