Teja Sajja : హనుమంతుడు సముద్రం దాటినట్టు అడ్డంకులను దాటాం.. తేజ సజ్జా కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరో తేజా సజ్జా( Teja Sajja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజ స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించాడు.

 Latest News About Hero Teja Sajja-TeluguStop.com

బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజా.ఇక ఆ తర్వాత హీరోగా మారి జాంబిరెడ్డి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపుని ఏర్పరచుకున్న తేజ తాజాగా హనుమాన్( Hanuman ) మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను అందుకోవడంతోపాటు ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Telugu Hanuman, Teja Sajja, Tollywood-Movie

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి గర్వించదగ్గ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.దర్శకుడు ప్రశాంత్ వర్మపై ( Directed Prashanth Verma )ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.అందులో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ చిత్రం కోసం మీరు రెండేళ్లుగా మరే సినిమా కూడా ఒప్పుకోలేదు.

దీనిపై మీకంత నమ్మకమేంటి? అని ప్రశ్నించగా నిజానికి నాకన్నా ఈ సినిమాపై నిర్మాత నిరంజన్‌ రెడ్డికి( Producer Niranjan Reddy ) బలమైన నమ్మకం ఉంది.దీని కోసం తను చేస్తున్న పని చూసి ఇది పూర్తయ్యే వరకు మరో సినిమా ఒప్పుకోకూడదని నేను బలంగా నిర్ణయించుకున్నాను అని తెలిపారు తేజా సజ్జా.

Telugu Hanuman, Teja Sajja, Tollywood-Movie

థియేటర్ల సమస్య వల్ల విడుదలకు ముందు హనుమాన్‌ విషయంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారా? అని ప్రశ్నించగా.అలాగని ఏం అనుకోలేదండి.నిజానికి విడుదలకు పదిరోజుల ముందు నుంచి కూడా నాకేం ఒత్తిడి లేదు.ఈ చిత్ర విషయంలో మాకు అన్నీ కలిసొచ్చాయి.ఆరంభంలో కొన్ని మాకు ఇబ్బందిగా అనిపించినా.ఆ దైవశక్తే మా వెనకుండి మమల్ని నడిపిస్తున్నట్లు అనిపించేది.

దాని వల్లే ఏ సమస్య ఎదురైనా దానంతట అదే తీరిపోతుందని బలంగా నమ్మేవాణ్ని.ఆ హనుమంతుల వారు సముద్రం దాటినట్లు మేము అన్ని అడ్డంకులు దాటుకొని సాఫీగా థియేటర్లలోకి వచ్చేశాం.

ఇప్పుడు సినిమాకి వస్తున్న అద్భుతమైన ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది.మేము పెద్దగా ప్రచారం చేయకున్నా ఇతర భాషల్లోనూ మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఇది పూర్తిగా ప్రేక్షకులు అందించిన విజయం.ప్రతి హీరోకి తమ కెరీర్‌లో మైలురాయి లాంటి చిత్రం ఒకటి కచ్చితంగా పడుతుంటుంది.

నా విషయంలో అది హనుమాన్‌ చిత్రమే.మళ్లీ ఇలాంటి మ్యాజిక్‌ను పునరావృతం చేయగలుగుతానా అని అప్పుడే నాలో ఒక భయం కూడా మొదలైపోయింది అని చెప్పుకొచ్చారు తేజా.

ఈ సందర్భంగా తేజ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube