న్యూ ఇయర్( New Year ) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు అంబరాన్ని అంటిన సంగతి తెలిసిందే.ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంవత్సరాంతాన్ని తెగ ఎంజాయ్ చేశారు.
వారిలో చాలామంది తమ పార్టీలకు అవసరమైన వాటిని పొందడానికి ఆహారం, కిరాణా డెలివరీ యాప్‌లను ఉపయోగించారు.ఈ యాప్‌లలో జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ ఒకటి.
అయితే న్యూ ఇయర్స్ సందర్భంగా బ్లింకిట్ కస్టమర్ ఒక ఎగ్జిక్యూటివ్‌తో ఫన్నీ చాట్ చేశాడు.దానిని బ్లింకిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఒక సమస్య ఉన్నట్లు సదర్ కస్టమర్ పేర్కొన్నాడు.
![Telugu Blinkit, Ceoalbinder, Eve, Zomato-Latest News - Telugu Telugu Blinkit, Ceoalbinder, Eve, Zomato-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/elebrations-Blinkit-Zomato-Funny-conversation-Social-media-CEO-Albinder-Dhindsa.jpg)
చాట్ సపోర్ట్ పర్సన్ అయిన ఆకాష్( Akash ), కస్టమర్‌ని వారి ఆర్డర్లో ఏమి తప్పు ఏందో చెప్పాలని అడిగాడు.బ్లింకిట్ నుంచి చిప్స్, డ్రింక్స్ ఆర్డర్ చేశామని, కానీ ఏదో మిస్ అయిందని కస్టమర్ చెప్పారు. ఏమి మిస్ అయిందని అడిగాడు ఆకాష్.
తమకు పార్టీ చేసుకునే స్నేహితులు లేరని కస్టమర్ చెప్పాడు.డెలివరీ చేసే వ్యక్తి తమతో ఉండగలరా అని కూడా కస్టమర్ అడిగాడు.
ఆర్డర్లో అన్ని వచ్చిన పార్టీ చేసుకోవడానికి రెడీ ఉన్న ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ పక్కన లేరని అతడు తెలిపాడు.దాంతో చాట్ ఎగ్జిక్యూటివ్ ఏం మాట్లాడాలో తెలియక ఆ చాటు లెఫ్ట్ అయ్యాడు.
![Telugu Blinkit, Ceoalbinder, Eve, Zomato-Latest News - Telugu Telugu Blinkit, Ceoalbinder, Eve, Zomato-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/New-Years-Eve-Celebrations-Blinkit-Zomato-Funny-conversation-Social-media-CEO.jpg)
బ్లింకిట్ ఈ సంభాషణను ఆన్లైన్లో పోస్ట్ చేసింది, “ఆకాష్ చాట్ నుంచి లెఫ్ట్ అయ్యాడు.” అని క్యాప్షన్ ఇచ్చింది.చాలా మంది ఈ పోస్ట్‌ను లైక్ చేసారు, దానిపై తమాషాగా కామెంట్లు చేశారు.పార్టీలో చేరేందుకు ఆకాష్ చాట్ వదిలేశారని కొందరు చమత్కరించారు.మరికొందరు ఇది చూసేందుకు చాలా బాధగా ఉందని పాపం అతడు ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నాడేమో అని అన్నారు.బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా కూడా ఈ సంభాషణను తన సొంత ఖాతాలో పంచుకున్నారు.
అతను నవ్వుతున్న ఎమోజితో, “అబ్బాయిలు దయచేసి ఇలా చేయడం ఆపండి,” అని అన్నాడు.